భర్త, ప్రియుడు.. ఇద్దరితో కలిసుంటా
పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఏడేళ్లుగా పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో ఈ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతనితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. చివరకు అది బయటపడటంతో ఇద్దరితో కలిసి ఉంటానంటూ మొండిపట్టు పట్టింది. అందుకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కరెంట్ పోల్ ఎక్కి ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం జరిగింది.
మ్యాటర్‌లోకి వెళ్తే.. పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఏడేళ్లుగా పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో ఈ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తకు విషయం తెలియడంతో నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని భర్తను ఒప్పించడానికి ప్రయత్నించింది. ఇందుకు భర్త ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.
ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపింది. గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేయడంతో వాళ్లు కరెంట్ సరఫరా ఆపేశారు. అనంతరం పోలీసులు స్పాట్‌కు చేరుకుని బలవంతంగా ఆమెను కిందకు దించారు.