ఆప్‌కు జాతీయ పార్టీ హోదా ఖాయం..?
గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు వస్తున్నకొద్దీ.. ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న సీట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తొలుత 2, 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్న ఆప్.. ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అనంతరం జాతీయ పార్టీ హోదా దక్కించుకోనుంది. ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసంగా 6 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే.. ఇప్పటికే ఆప్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ హోదాకు అవసరమైన ఓటింగ్ శాతం సాధించే అవకాశముంది.
ఇప్పటికే గుజరాత్‌లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీకి 20 శాతం పైగా ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సాధిస్తే.. ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఖాయం కానున్నట్టు తెలుస్తోంది.
గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు వస్తున్నకొద్దీ.. ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న సీట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తొలుత 2, 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్న ఆప్.. ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సీట్లు మాత్రం గణనీయంగా తగ్గిపోతున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఓట్లకు ఆప్ భారీగా గండి కొట్టినట్టు అర్థమవుతోంది.
మరోపక్క క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివావా జామ్‌నగర్ నార్త్‌లో మూడు రౌండ్ల తర్వాత ముందంజలోకి వచ్చింది. పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. కూడా ప్రస్తుతం ముందంజలోకి వచ్చినట్టు తెలిసింది.