Telugu Global
National

భర్త ఆదాయ వివరాలు R T I కింద భార్య పొందవచ్చు... సీఐసీ సంచలన ఆదేశం

R T I కింద భార్యలకు భర్తల ఆదాయ వివరాలు ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ అందజేయాల్సిందే అని కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఆదేశాలు జారీ చేసింది. అలా వివరాలు పొందడం ఆమె హక్కని CIC స్పష్టం చేసింది.

భర్త ఆదాయ వివరాలు R T I కింద భార్య పొందవచ్చు... సీఐసీ సంచలన ఆదేశం
X

చాలా మంది భర్తలు తమ ఆదాయ వివరాలు భార్యలకు చెప్పరు. ఒక వేళ చెప్పినా నిజాలు చెప్పరు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకునే సమయంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా మంది తమ అసలైన ఆదాయాలు చూపించరు. ఈ సమస్యను కేంద్ర సమాచార కమిషన్ తీర్చేశారు. R T I కింద భార్యలకు భర్తల ఆదాయ వివరాలు ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ అందజేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.

సంజు గుప్తా అనే మహిళ తన జీవిత భాగస్వామి ఆదాయ వివరాలను కోరుతూ ఆర్టీఐ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట్లో, ఈ వివరాలు చెప్పడానికి ఆమె భర్త అంగీకరించలేదనే కారణంతో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CPIO), ఆదాయపు పన్ను అధికారి, బరేలీలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం RTI కింద వివరాలను అందించడానికి నిరాకరించారు.

ఆ తర్వాత ఆ మహిళ అప్పీలేట్ అథారిటీ (FAA) కి అప్పీల్ దాఖలు చేసింది అయినప్పటికీ, CPIO యొక్క ఉత్తర్వును సమర్దించిన FAA ఆమెకు వివరాలు అందించడానికి నిరాకరించింది. దాంతో సంజు గుప్తా కేంద్ర సమాచార కమిషన్ (CIC)కు రెండవ అప్పీల్‌ను దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుల గత ఆదేశాలు, తీర్పులను పరిశీలించిన‌ కేంద్ర సమాచార కమిషన్ తన ఉత్తర్వులు ఇచ్చింది.

ఆమె అప్లై చేసిన తేదీ నుండి 15 రోజుల లోపు పబ్లిక్ అథారిటీ వద్ద అందుబాటులో ఉన్న ఆమె భర్త యొక్క పన్ను విధించదగిన ఆదాయం వివరాలను ఆమెకు అందించాలని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CPIO)ని ఆదేశించింది. అలా వివరాలు పొందడం ఆమె హక్కని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.

First Published:  3 Oct 2022 3:03 PM IST
Next Story