Telugu Global
National

107 కేజీల బంగారం పట్టివేత ఎక్కడంటే?

అహ్మదాబాద్‌లో రూ.100 కోట్ల విలువైన బంగారంను పోలీసులు పట్టుకున్నారు.

107 కేజీల బంగారం పట్టివేత ఎక్కడంటే?
X

గుజరాత్ అహ్మదాబాద్‌లో పోలీసులు 107 కిలోల బంగారం పట్టుకున్నారు. 88 కేజీల పసిడి కడ్డీలు, 19.66 కేజీల బంగారు నగలు, రూ.1.37 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ బ్రోకర్ మహేంద్ర షా కుమారుడు మేఘా షా ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్త తనిఖీలు చేసి వీటిని సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది.

అవిష్కార్ అపార్ట్‌మెంట్ లోని మూసి ఉన్న ఫ్లాట్‌ను తెరిచి చూడగా.. అక్కడ 107 కిలోల బంగారంతో పాటు రూ.60 లక్షల నగదు కూడా లభ్యమైంది. అయితే, దొరికిన బంగారం విలువను లెక్కిస్తున్నామని ఎటీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎల్ చౌదరి తెలిపారు. నిందితులు, మేఘ్ షా, మహేద్ర షా షేర్ మార్కెట్ ట్రేడింగ్, బెట్టింగ్, బంగారాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్ఎల్ చౌదరి స్పష్టం చేశారు.

First Published:  18 March 2025 3:00 PM IST
Next Story