ఈ ఏడాది వర్షాలు పడేదెప్పుడు?
జూన్ మూడోవారం నడుస్తున్నా ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. అసలు ఈ ఏడాది వర్షాలు ఏ నెలలో కురుస్తాయి? రుతుపవనాల గురించి వాతావరణ శాఖ ఏమంటుంది?
జూన్ మూడోవారం నడుస్తున్నా ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. అసలు ఈ ఏడాది వర్షాలు ఏ నెలలో కురుస్తాయి? రుతుపవనాల గురించి వాతావరణ శాఖ ఏమంటుంది?
ప్రతి ఏడాది జూన్ నెలలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. దాంతో జూన్ నెలలో వాతావరణం కాస్త చల్లబడుతుంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం జూన్ మూడోవారం నడుస్తున్నా ఇంకా వర్షం జాడ కనిపించడం లేదు.
నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు. అందుకే వేడి ఇంకా అలాగే ఉంది. అయితే జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయి. అయితే దీనికి కాస్త టైం పడుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.
రుతుపవనాల రాక ఆలస్యం అవ్వడంతో పడమర, ఉత్తరం దిశగా గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగానే ఇంకా ఎండలు మండుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. ఇదీకాక రుతువుల సీజన్లు ముందుకు వెనక్కి జరగాడికి క్లైమెట్ ఛేంజ్ అనేది అతిపెద్ద కారణంగా ఉంటోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 40 డిగ్రీల మేర ఉంటున్నాయి. కొన్ని చోట్ల హీట్‌వేవ్ కూడా కొనసాగుతుంది. వాతావరణం చల్లబడే వరకూ జనాలు బయట అంతగా తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెల చివర్లో లేదా జులై నెలలో వర్షాలకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు.