Telugu Global
National

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇది మీరు గమనించారా..?

ప్రస్తుతానికి ఇది వెబ్ వాట్సప్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్ లోని బ్రౌజర్ లో వాట్సప్ వినియోగించుకునేవారు ఈ తేడా గమనించగలరు.

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇది మీరు గమనించారా..?
X

గ్రూప్ చాటింగ్ లో వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. గ్రూప్ లో ఇప్పటి వరకు ఎవరెవరు ఏయే మెసేజ్ లు పెట్టారనే విషయం వారి పేర్ల ద్వారా తెలిసేది. ఇప్పుడు పేర్లతోపాటు వారి డీపీ కూడా కనపడుతోంది. గ్రూప్ చాటింగ్ లో ఈరోజే ఈ ఫీచర్ జోడించింది వాట్సప్. గ్రూప్ చాటింగ్ చేసేటప్పుడు డిస్ ప్లే పిక్చర్ గా పెట్టుకున్న ఫొటో వారి మెసేజ్ పక్కనే కనపడుతోంది. కాంటాక్ట్ లిస్ట్ లో లేనివారికి మాత్రం నో డీపీ ఇమేజ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది వెబ్ వాట్సప్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్ లోని బ్రౌజర్ లో వాట్సప్ వినియోగించుకునేవారే ఈ తేడా గమనించగలరు.

హైపర్ లింక్ తో సహా..

గ్రూప్ చాట్ లో కనపడే డిస్ ప్లే పిక్చర్ పై క్లిక్ చేస్తే వెంటనే వారి కాంటాక్ట్ డేటా కనపడుతుంది. ఆ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరు, ఏయే గ్రూప్స్ లో కామన్ గా ఉన్నారు అనే విషయం తెలిసిపోతుంది. గతంలో కాంటాక్ట్ నెంబర్ లేదా, కాంటాక్ట్ లో సేవ్ అయి ఉన్న పేరు మాత్రమే ఇక్కడ కనిపిస్తుండేది. ఇప్పుడు దీనికి డిస్ ప్లే పిక్చర్ కొత్తగా జత చేరింది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు..

సోషల్ మీడియాలో ఎన్ని రకాల ప్లాట్ ఫామ్స్ ఉన్నా కూడా సమాచార మార్పిడికి వాట్సప్ ని మించింది లేదు. అయితే వాట్సప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. టెలిగ్రామ్ వంటి పోటీ యాప్ లు ఉన్నా కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. గ్రూప్ చాటింగ్ లో డిస్ ప్లే పిక్చర్స్ కనపడే విధంగా చేసిన మార్పుపై వాట్సప్ ప్రకటన చేయలేదు. నేరుగా దీన్ని అమలులోకి తీసుకొచ్చే సరికి వాట్సప్ యూజర్లు ఈరోజు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతానికి ఇది వెబ్ వాట్సప్ లో మాత్రమే కనిపిస్తోంది. మొబైల్ లో మాత్రం ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

First Published:  7 Dec 2022 12:56 PM IST
Next Story