Telugu Global
National

నేను గొడ్డు మాసం తింటే పార్టీకేం ఇబ్బంది ? -మేఘాలయ బీజెపి అధ్యక్షుడి కామెంట్స్

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ ఓ ప్రముఖ వెబ్ సైట్ తో మాట్లాడుతూ బీజేపీలో బీఫ్ తినకూడదనే ఆంక్షలేమీ లేవని అన్నారు. తాను గొడ్డు మాంసం తింటానని, దానితో ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నాడు.

నేను గొడ్డు మాసం తింటే పార్టీకేం ఇబ్బంది ? -మేఘాలయ బీజెపి అధ్యక్షుడి కామెంట్స్
X

ఈ దేశంలో బీఫ్ తినే వాళ్ళు దేశద్రోహులని హిందుత్వ వాదులు ప్రచారం చేస్తూ ఉంటారు. అనేక రాష్ట్రాల్లో బీఫ్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేస్తుంది. బీఫ్ మాసం ఉందనే నెపంతో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉంటాయి...ఒక్కో సారి ఆ దాడులు హత్యల వరకు దారి తీస్తాయి. ఈ నేపథ్యంలో ఆశ్చర్యంగా మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు తాను బీఫ్ తింటానని, తానుబీఫ్ తింటే పార్టీకేం ఇబ్బందని బహిరంగంగా ప్రశ్నించారు.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ ఓ ప్రముఖ వెబ్ సైట్ తో మాట్లాడుతూ బీజేపీలో బీఫ్ తినకూడదనే ఆంక్షలేమీ లేవని అన్నారు. తాను గొడ్డు మాంసం తింటానని, దానితో ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నాడు.

''బీజేపీలో ఎలాంటి సమస్య లేదు.. బీజేపీ ఏ కులం, మతం గురించి ఆలోచించదు.. మన ఆహారపు అలవాటు గురించి ఒక‌ రాజకీయ పార్టీకి ఎందుకు ఇబ్బంది? " అని ఆయన ప్రశ్నించారు.

హిందూ మతంలో పవిత్రంగా భావించే గోహత్యపై పార్టీ వైఖరి గురించి అడిగినప్పుడు, "మేము మా స్వంత ఆహారపు అలవాట్లను అనుసరిస్తాము. దానిపై నిషేధం లేదు." అని మావ్రీ పేర్కొన్నారు.

మేఘాలయలో ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారని, రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన అన్నారు. ఇది మా అలవాటు, సంస్కృతి అని ఆయన అన్నారు.

గొడ్డు మాంసంపై తన వ్యాఖ్యలతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారాయన‌. 60 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నామని, మెజార్టీ స్థానాలను గెల్చుకుంటామని ఆయన తెలిపారు. .

''రాబోయే ఎన్నికల్లో కనీసం 34 సీట్లు గెలుస్తాం, ఇదే మా అంచనా.. మాకు ఓటు వేయాలా వద్దా అనేది ఇప్పుడు ప్రజలపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరగాలంటే ప్రజలు కచ్చితంగా బీజేపీకి పట్టం కట్టాలి.'' అని ఆయన అన్నారు.

First Published:  19 Feb 2023 8:11 PM IST
Next Story