రాహుల్ గాంధీ టీ షర్ట్ వెనక ఏముంది ? పరిశోధన చేసి నిజాలు తేలుస్తున్న ఔత్సాహికులు
ఇంత చలిలో ఒక్క టి షర్ట్ తో రాహుల్ గాంధీ ఎలా నడుస్తున్నాడు? అదెలా సాధ్యమవుతోంది ? దాని వెనక ఉన్న మర్మమేంటి ? అని కొందరు వేరే పనులేమీ లేని వాళ్ళు పరిశోధన మొదలు పెట్టారు. చాలా రోజులుగా చేస్తున్న వారి పరిశోధన ఫలితాలను నేడు ప్రకటించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక పార్టీ అగ్రనేత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిర్వహిస్తున్న పాద యాత్రపై దేశ ప్రజల్లో చర్చ జరగడం సహజం. అయితే ఇప్పుడా యాత్రపై కాకుండా ఆయన వేసుకున్న టీ షర్ట్ పై చర్చ జరుగుతోంది. వణికిస్తున్న చలిలో రాహుల్ గాంధీ టీ షర్ట్ మాత్రమే వేసుకొని ఉత్సాహంగా నడుస్తూ ఉండటంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా మరి కొందరు అది ప్రచార గిమ్మిక్కంటూ కొట్టి పడేస్తున్నారు.
అయితే అసలు ఇంత చలిలో ఒక్క టి షర్ట్ తో రాహుల్ గాంధీ ఎలా నడుస్తున్నాడు? అదెలా సాధ్యమవుతోంది ? దాని వెనక ఉన్న మర్మమేంటి ? అని కొందరు వేరే పనులేమీ లేని వాళ్ళు పరిశోధన మొదలు పెట్టారు. చాలా రోజులుగా చేస్తున్న వారి పరిశోధన ఫలితాలను నేడు ప్రకటించారు.
ఈ రోజు ఆ పరిశోధన ఫలితాల మీద చర్చ ట్విట్టర్ లో 'టీ షర్ట్' అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఆ పరిశోధకులు తేల్చిందేంటంటే.... రాహుల్ గాంధీ ఆ టీ షర్ట్ లోపల థర్మల్ వేర్ వేసుకుంటున్నాడని తమ అపరాధ పరిశోధనలో తేల్చారు. అందువల్లే ఆయనకు చలివేయడంలేదని, ఆయన తపస్వి అనేది ఉత్త మాటలే అని వారు తేల్చి పడేశారు. దీనిపై ఈ రోజు ట్విట్టర్ లో యుద్దమే జరుగుతోంది.
ఈ పరిశోధన చేసింది బీజేపీ ఐటీ సెల్ అని కొందరు నెటిజనులు ఆరోపిస్తుండగా, థర్మల్ వేసుకుంటే తప్పేంటి? అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఆ పరిశోధకులకు మద్దతుగా నిలబడ్దవాళ్ళున్నారు. వారు రాహుల్ గాంధీ టీ షర్ట్ లోపలి నుంచి కొద్దిగా బైటికి కనపడుతున్న థర్మల్ వేర్ ను రెడ్ కలర్ తో రౌండ్ చుట్టి, చూడండి మేము కనిపెట్టేశాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా దేశ ప్రజలను తన వైపు ఆకర్షించడానికి రాహుల్ గాంధీ చేస్తున్న జిమ్మిక్కు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ అపరాధ పరిశోధన పై నెటిజనులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొందరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కొందరు కామెంట్లు చేస్తుండగా, మనం చర్చించాల్సింది వేసుకున్న బట్టల గురించి కాదు పంచుతున్న ప్రేమ గురించి అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.
''మీరు ట్రోలింగ్ చేసే పనిని చాలా సీరియస్‌గా తీసుకున్నప్పుడు అది సైకోటిక్ అబ్సెషన్‌గా మారుతుంది! బ్లూ టిక్ హ్యాండిల్స్ విశ్రాంతి లేని రాత్రులు గడుపుతున్నాయి.
ఆశువుగా మాట్లాడే వ్యక్తులు టెలిప్రాంప్టర్‌ని ఉపయోగించరని ఎవరైనా చెప్పండి!'' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
అయితే భారత్ జోడో యాత్ర లక్ష్యాల మీద కానీ, యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటల మీద గానీ చర్చ జరగకుండా ఆయన వేసుకున్న బట్టల మీద చర్చ జరగడం మన దేశ దౌర్భాగ్యం!
Bhakts are a desperate breed
— Supriya Shrinate (@SupriyaShrinate) January 7, 2023
They are actually collectively zooming in and taking screenshots of RG, his ‘neck’ and ‘chest’, ‘wrinkles’ on his T-shirt
These desperadoes! https://t.co/IQqddo2lGd