Telugu Global
National

బీఆర్ఎస్ ఒంటరి కాదు.. మా వెంట మిత్రులున్నారు : సీఎం కేసీఆర్

తాము ఎవరివైపు లేమంటే ఒంటరిగా ఉన్నట్లు కాదని.. తమ వెంట మిత్రులు ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఒంటరి కాదు.. మా వెంట మిత్రులున్నారు : సీఎం కేసీఆర్
X

బీఆర్ఎస్ ఒంటరిగా లేదని.. తమ వెంట మిత్రులు ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. మేము ఇటు ఇండియా వైపు లేము.. అటు ఎన్డీయే వైపు లేము. తాము ఎవరి వైపు లేమంటే ఒంటరిగా ఉన్నట్లు కాదని.. తమ వెంట మిత్రులు ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు కూటముల వైపు లేము.. భవిష్యత్‌లో ఉండబోమని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పర్యటన ముగించుకొని వస్తున్న క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నయా ఇండియా అంటే ఏంటి? ఆ కూటిమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఎలాంటి మార్పు రాలేదు. దేశంలో గణనీయమైన మార్పు జరగాల్సి ఉన్నది. దేశం కూడా అందుకు సిద్ధంగా ఉందని కేసీఆర్ అన్నారు. మహరాష్ట్రలో తమ పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే మహాలో ఎన్నికల గంట మోగించామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి 14 లక్షల 10 వేల మంది పదాధికారులు ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు 50 శాతం పని పూర్తయ్యింది. మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామగ్రామాన పూర్తి స్థాయిలో పని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఎన్నో అద్బుతమైన వనరులు ఉన్నాయి. దేశంలోనే మహారాష్ట్ర వంటి అద్భుతమైన రాష్ట్రం మరొకటి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సంపదకు కూడా కొదువ లేదని.. ఉపాధి అవకాశఆలు అపారంగా ఉన్నా.. యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ఔరంగాబాద్ వంటి నగరంలో నీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మండిపడ్డారు.

దళిత సమాజం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలి. మహారాష్ట్రలో దళితులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అమెరికా వంటి దేశంలో వివక్షను పక్కన పెట్టి ఒబామాను అధ్యక్షుడిని చేసుకొని.. తమ పాపాలను కడుక్కున్నారని చెప్పారు.

First Published:  2 Aug 2023 7:18 AM IST
Next Story