Telugu Global
National

బీహార్ లో నడిరోడ్డులోనే 'బూతు'..

రాత్రి 10గంటల సమయంలో హఠాత్తుగా బూతు మెసేజ్ లు అక్కడ కనిపించాయి. ఈ మెసేజ్ లను కొంతమంది సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బీహార్ లో నడిరోడ్డులోనే బూతు..
X

బీహార్ లో బిజీగా ఉన్న ప్రాంతం అది. భాగల్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ చౌక్ లో ఎల్ ఈడీ స్క్రీన్ పెట్టారు. ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పేందుకు, ట్రాఫిక్ నియమాలు చూపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎల్ ఈడీ స్క్రీన్స్ పై సడన్ గా బూతు మెసేజ్ లు ప్రత్యక్షమయ్యాయి. ఆ పని కోసం ఇక్కడ సంప్రదించండి అంటూ మెసేజ్ డిస్ ప్లే కావడంతో జనం షాకయ్యారు. ఆ డిస్ ప్లే బోర్డ్ ల దగ్గర గుమికూడారు. బూతు మెసేజ్ లపై భాగల్ పూర్ మున్సిపాల్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది..?

భాగల్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల జీవన్ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు కూడళ్లలో ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. వాటిపై ప్రజలకు ఉపయోగపడే సందేశాలు ఉంచాలని సూచించారు. కానీ, రాత్రి 10గంటల సమయంలో హఠాత్తుగా బూతు మెసేజ్ లు అక్కడ కనిపించాయి. ఈ మెసేజ్ లను కొంతమంది సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు సంస్థ కి సంబంధించిన సర్వర్ ని ఎవరో హ్యాక్ చేసి ఇలాంటి మెసేజ్ లు పెట్టారని విచారణలో తేలింది.


ఆమధ్య బ్లూ ఫిల్మ్..

మార్చి 20న కూడా ఇలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్లో టీవీ స్క్రీన్లపై మూడు నిమిషాలపాటు బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. అధికారులు అప్రమత్తమయ్యే లోపు స్టేషన్ అంతా రచ్చ రచ్చగా మారింది. ఆ బ్లూ ఫిల్మ్ ని వీడియో తీసిన చాలామంది సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అప్పుడు కూడా వ్యాపార ప్రకటనలు ఇచ్చే థర్డ్ పార్టీపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ తన కంప్యూటర్ హ్యాక్ అయిందని చెబుతోంది. మొత్తమ్మీద బీహార్ లో పబ్లిక్ ప్లేసుల్లో ఈ బూతు గోల సంచలనంగా మారింది.

First Published:  19 April 2023 12:05 PM IST
Next Story