నాకు ఓటేస్తేనే మీ పనులవుతాయి...ముస్లిం ఓటర్లకు బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు
హాసన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రీతమ్ గౌడ. తన నియోజకవర్గానికి చెందిన ముస్లిం ఓటర్లను ఉద్దేశించి కన్నడలో మాట్లాడటం ఈ వీడియోలో కనిపిస్తున్నది. అయితే ఇలా బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడారన్నది స్పష్టత లేదు.
ముస్లిం ఓటర్లు తనకు ఓటు వేస్తే తప్ప వారి వ్యక్తిగత పనులు తాను చేయబోనని కర్ణాటక ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో బయటపడింది. " మీరు నాకు సహాయం చేయకపోతే, మీకు నేను సహాయం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు" అని వీడియోలోని బిజెపి ఎమ్మెల్యే అన్నారు.
హాసన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రీతమ్ గౌడ. తన నియోజకవర్గానికి చెందిన ముస్లిం ఓటర్లను ఉద్దేశించి కన్నడలో మాట్లాడటం ఈ వీడియోలో కనిపిస్తున్నది. అయితే ఇలా బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడారన్నది స్పష్టత లేదు.
"నేను ఇప్పటి వరకు ముస్లిం సోదరులను నా సోదరులుగానే చూసాను. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాను. నేను మీకోసం పని చేసి మీరు మాత్రం నాకు ఓటు వేయకపోతే నేను మీకు సహాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇది మీ సమస్య. నేను అలాంటి నిర్ణయం తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది." అని ఆ వీడియోలో ఆయన మాటలు వినిపిస్తున్నాయి.
''మీరు మూడు ఎన్నికల్లో ఓటు వేయకుండా మోసం చేశారు. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయి.. మళ్లీ మోసం చేస్తే నేను కూడా అలాగే ఉంటాను. మీకు అందుబాటులో ఉండను.. నా దగ్గరకు వస్తే.. కాఫీ అందించి వెనక్కి పంపుతాను. నేను ఏ పనీ చేయను." అని ప్రీతమ్ గౌడ బెదిరింపు ధోరణిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా బీజేపీ ఎమ్మెల్యే ఓటేయక పోతే పనులు చేయనని ఇంత పచ్చిగా చెప్తుండటం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
An alleged video of #BJP #Hassan MLA Preetam Gowda is going viral wherein he threatens #Muslim constituents of Shrinagar to vote for him or else he won't carry out any of their personal work.He goes on to say, he treats #Muslims with love and affection.But, they have ditched him pic.twitter.com/GU7chHHYpA
— Imran Khan (@KeypadGuerilla) December 11, 2022