Telugu Global
National

ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఆదివారం జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం

ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి
X

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎయిమ్స్‌లో చేరారు. ఆదివారం ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో ఆయనను తెల్లవారుజామున 2 గంటలకు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

First Published:  9 March 2025 11:28 AM IST
Next Story