Telugu Global
National

'వందేభారత్' వరుస‌ ప్రమాదాలు: మొన్న ఆవు, నిన్న ఎద్దు, ఇవాళ‌ మహిళ మృతి!

వందే భారత్ రైళ్ళ వరస ప్రమాదాలు ఇప్పటి వరకు పశువుల ప్రాణాలు తీయగా ఇప్పుడు ఓ మహిళ మృతి చెందింది. గుజరాత్‌లో మంగళవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుండి ముంబై సెంట్రల్‌కు వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని 54 ఏళ్ల మహిళ మరణించింది.

వందేభారత్ వరుస‌ ప్రమాదాలు:  మొన్న ఆవు, నిన్న ఎద్దు, ఇవాళ‌ మహిళ మృతి!
X

ఈ సారివందే భార‌త్ రైలుకు ఓ మహిళ బ‌లైంది. గుజరాత్‌లో మంగళవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుండి ముంబై సెంట్రల్‌కు వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని 54 ఏళ్ల మహిళ మరణించింది. బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్ అనే మ‌హిళ ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

నెల‌లోనే నాలుగు ప్ర‌మాదాలు..

గత నెల రోజుల్లో ఈ వందే భార‌త్ రైలు ఢీకొని ట్రాక్‌పై పశువులు మృత్యువాత పడిన ఘటనలు మూడు జరిగాయి. గత నెలలో వత్వా , మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెల మందను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతిన్న విష‌యం తెలిసిందే. మరుసటి రోజు (అక్టోబర్ 7) ఆనంద్ సమీపంలో రైలు ఒక ఆవును ఢీకొట్టింది. మరో ఘటనలో గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది.

దేశీయంగా రూపొందించి తయారు చేసిన సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్ సిరీస్‌లో మూడవది. సెప్టెంబరు 30న గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి వందే భార‌త్ రైలును ప్రారంభించారు.

First Published:  9 Nov 2022 5:39 AM GMT
Next Story