Telugu Global
National

వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇలా అయ్యిందేంటి..?

ఈ రోజు ఉదయం వత్వా స్టేషన్ - మణి నగర్ మధ్య ఈ రైలు ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలపైకి వచ్చిన గేదెలను ఇంజిన్ ఢీకొట్టింది. దీంతో వందే భారత్ ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇలా అయ్యిందేంటి..?
X

మైలేజీ పెరగాలంటే, వాహనం బరువు తక్కువ ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోనే ఇప్పుడు వస్తున్న కార్లు చాలా డెలికేట్‌గా తయారవుతున్నాయి. ఆఖరికి రైళ్ల విషయంలో కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నట్టు అనిపిస్తోంది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో డొల్లతనం బయటపడింది. గేదెలను ఢీకొట్టిన ఈ రైలు ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది. కారు బానెట్ లాగా ఊడిపోయి కింద పడిపోయింది. ఈ ప్రమాదంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణంపై మరిన్ని సందేహాలు ముసురుకుంటున్నాయి.

గత నెల ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించారు. ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్‌కు ఈ రైలు వెళ్తుంది. ఈ రోజు ఉదయం వత్వా స్టేషన్ - మణినగర్ మధ్య ఈ రైలు ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలపైకి వచ్చిన గేదెలను ఇంజిన్ ఢీకొట్టింది. దీంతో వందే భారత్ ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది.

ప్రమాదాలను ఆపలేరా..?

విచిత్రం ఏంటంటే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదాలను నివారించే కవచ్ టెక్నాలజీ ఉంది. ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే అవి ఢీకొట్టకుండా దేశీయంగా తయారు చేసిన టెక్నాలజీయే కవచ్. అయితే ఇది కేవలం రైళ్లకే కానీ, పట్టాలపై ఏదైనా అడ్డుగా ఉంటే ఉపయోగపడదని తేలిపోయింది. మేకిన్ ఇండియా గురించి గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో కూడా భారీగా ప్రచారం చేసుకుంది. ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ ఇదేనని డబ్బా కొట్టుకుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కల సాకారమైందని, ఆ తర్వాత ఇక బుల్లెట్ ట్రైన్‌ని రంగంలోకి దింపడమేనని అన్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు వందే భారత్‌కే ఇలా బ్రేక్ పడింది. వేగం సంగతి సరే, ముందు భారత్‌లో ఉన్న రైల్వే ట్రాక్‌లు దానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా..!

First Published:  6 Oct 2022 4:32 PM IST
Next Story