పెళ్ళైన గంటకే విడాకులు
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో పెళ్ళైంది. పెళ్ళి పూర్తవగానే ఆ వ్యక్తి మొదటి భార్య రంగప్రవేశం చేసింది. తాను ఉండగా మరో పెళ్ళి ఎలా చేసుకుంటావంటూ ఆమె గొడవకు దిగింది.
పెళ్ళైన గంటకే విడాకులయ్యాయి. యువతికి మరో యువకుడితో మళ్ళీ పెళ్ళైంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో పెళ్ళైంది. పెళ్ళి పూర్తవగానే ఆ వ్యక్తి మొదటి భార్య రంగప్రవేశం చేసింది. తాను ఉండగా మరో పెళ్ళి ఎలా చేసుకుంటావంటూ ఆమె గొడవకు దిగింది.
నిజానికి అతనికి అప్పటికే పెళ్ళయి నాలుగేళ్ళయ్యింది. భార్యా భర్తల మధ్య గొడవలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. దాంతో ఆ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ యువతితోనే పెళ్ళికి సిద్దమయిపోయాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి బంధువులకు ఏం చెయ్యాలో తోచలేదు. చివరకు సమస్య పోలీసు స్టేషన్ కు చేరింది. పోలీసులు గ్రామపంచాయితీ పెద్దలు చర్చలు జరిపి చివరకు ఆ వ్యక్తి కొత్తగా పెళ్ళి చేసుకున్న యువతికి విడాకులు ఇవ్వాలని, అతని తమ్ముడితో ఆ యువతికి పెళి జరిపించాలని నిర్ణయించారు. పెద్దల నిర్ణయానికి ఆ వ్యక్తి కూడా తలూపడంతో పెళ్ళి మండపంలోనే ఆ యువతికి అతను విడాకులు ఇచ్చాడు. ఆ వెంటనే అతని సోదరుడితో వివాహం జరిగిపోయింది.
అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అస్మోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అస్మోలి సంజయ్‌కుమార్ తెలిపారు. ఎవరూ ఎలాంటి పిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కథ సుఖాంతం అయినందుకు కొందరు ఆనందం వ్యక్తం చేయగా, మొదటి భార్య ఉండగా చట్ట విరుద్దంగా మరో పెళ్ళి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల పలువురు విమర్శలు సంధించారు.