Telugu Global
National

50 ఏళ్లకే పోలీసులకు రిటైర్మెంట్

50 ఏళ్లు దాటిన పోలీసుల పదవీ విరమణకోసం స్క్రీనింగ్‌ కు సంబంధించి యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్‌ రికార్డు పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయించబోతున్నట్టు అందులో పేర్కొంది.

50 ఏళ్లకే పోలీసులకు రిటైర్మెంట్
X

50 ఏళ్లకే పోలీసులకు రిటైర్మెంట్

పోలీసులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. 50 ఏళ్లకే పోలీసులు పదవీవిరమణ చేసేలా కొత్త నిర్ణయం తీసుకుంది. నిర్బంధ పదవీ విరమణకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇకపై యూపీలో 50 ఏళ్లు దాటిన పోలీసులు రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారులైనా, కానిస్టేబుళ్లయినా దీనికి అతీతులు కాదు.

50 ఏళ్లు దాటిన పోలీసుల పదవీ విరమణకోసం స్క్రీనింగ్‌ కు సంబంధించి యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్‌ రికార్డు పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయించబోతున్నట్టు అందులో పేర్కొంది. నవంబర్ 30లోగా దీనికి సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.

2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు పూర్తయినవారికి నిర్బంధ పదవీ విరమణ అమలు చేయాలని చూస్తోంది యూపీ ప్రభుత్వం. వారి ట్రాక్ రికార్డు పరిశీలించిన తర్వాత రిటైర్మెంట్ తేదీని ప్రకటించి, ఆలోగా నిర్బంధ పదవీ విరమణ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఫిజికల్ ఫిట్ నెస్ కంటే అవినీతి, ట్రాక్ రికార్డ్ కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం విశేషం. సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే.. అలాంటి వారికి వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం స్పీడందుకుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఈ నిబంధన తెరపైకి తెచ్చారు.

First Published:  28 Oct 2023 7:17 AM GMT
Next Story