Telugu Global
National

UP:అన్యాక్రాంతమైన ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వం విచారణ‌

భారతదేశం నుండి పాకిస్తాన్ లేదా భారతదేశంతో శత్రుత్వం ఉన్న ఇతర దేశాలకు వలస పోయిన వ్యక్తులు వదిలివేసిన ఆస్తులపై ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుం భిగించింది. ఇటువంటి ఆస్తులలో దాదాపు 30 శాతం ఆస్తులు అక్రమ ఆక్రమణలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

UP:అన్యాక్రాంతమైన ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వం విచారణ‌
X

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'శత్రువు ఆస్తుల' ఆక్రమణలను క్లియర్ చేయడానికి రాష్ట్రవ్యాప్త డ్రైవ్‌కు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో అటువంటి ఆస్తులలో దాదాపు 30 శాతం అక్రమ ఆక్రమణలో ఉన్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంది.

'శత్రువు ఆస్తులు' అంటే.. భారతదేశం నుండి పాకిస్తాన్ లేదా భారతదేశంతో శత్రుత్వం ఉన్న ఇతర దేశాలకు వలస పోయిన వ్యక్తులు వదిలివేసిన ఆస్తులని ప్ర‌భుత్వం నిర్వ‌చించింది. ప‌నిలో ప‌నిగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నామ మాత్ర ధ‌ర‌కు భూముల‌ను అద్దెకు తీసుకున్న వారిపై కూడా క‌న్నేసింది.

యు.పి ప్రభుత్వం డేటా ప్రకారం . , అటువంటి ఆస్తులు సుమారు 1,467 మాఫియా, ఇతరుల ఆక్రమ‌ణ‌లోనే ఉండ‌గా 424 ఆస్తులు నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు గ‌త రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో అద్దెకు తీసుకున్నవి. మొత్తంమీద, రాష్ట్రంలో ఉన్న 5,936 అటువంటి ఆస్తులలో దాదాపు 2,250 ఆక్రమించిన ఆస్తులేన‌ని ప్ర‌భుత్వ డాటా పేర్కొంది.

ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఉన్న‌త స్థాయి స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇటువంటివి ఆస్తుల‌పై స‌ర్వే చేయాల‌ని హోం శాఖ‌ను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దశాబ్దాలుగా ఈ ఆస్తులను ఆక్రమించిన పలువురు కౌలుదారులు ఇప్పటి వరకు నామమాత్రపు అద్దె చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో అద్దెకు తీసుకున్న 'శత్రువు ఆస్తుల' రీవాల్యుయేషన్‌ను కూడా నిర్వహించాలని రాష్ట్రం నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఆస్తులను అంచనా వేస్తారు.

First Published:  7 Nov 2022 10:15 AM GMT
Next Story