Telugu Global
National

ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రదాన్!

ధర్మేంద్ర ప్రదాన్ పేరు ఒడిశా సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఒడిశాలో బీజేపీ విజయం వెనుక ప్రదాన్ కీ రోల్ ప్లే చేశారు.

ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రదాన్!
X

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. 24 ఏళ్లుగా ఓటమి ఏరుగని నవీన్‌ పట్నాయక్‌కు షాక్‌ ఇచ్చారు ప్రజలు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 78 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. బిజు జనతాదళ్‌ 51 స్థానాలతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ 14 స్థానాల్లో గెలుపొందింది. సీపీఎం 1, ఇతరులు 3 స్థానాలు దక్కించుకున్నారు.

దీంతో ఇప్పుడు ఒడిశా కొత్త సీఎం ఎవరనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేరు ఒడిశా సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఒడిశాలో బీజేపీ విజయం వెనుక ప్రదాన్ కీ రోల్ ప్లే చేశారు. మేనిఫెస్టో రూపకల్పన నుంచి ప్రచార వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఒడిశా చీఫ్‌ మినిస్టర్‌గా ధర్మేంద్ర ప్రదాన్‌ పేరును కమలనాథులు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ధర్మేంద్ర ప్రదాన్.. 1997లో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1997-2000 మధ్య బిజు జనతాదళ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2004లో తొలిసారి దియోఘర్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత బిహార్‌, మధ్యప్రదేశ్ నుంచి వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో ఎడ్యూకేషన్‌ మినిస్టర్‌గా ఉన్నారు. ఇక నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సంబల్‌పూర్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

First Published:  5 Jun 2024 7:22 AM GMT
Next Story