జాతీయ జెండాను అవమానించిన అమిత్ షా తనయుడు జై షా..
మ్యాచ్ విజయం అనంతరం చప్పట్లతో టీమిండియాకి శుభాకాంక్షలు చెబుతున్న జైషా కు పక్కనున్నవారు జాతీయ జెండాను అందించారు. కానీ జైషా సున్నితంగా తిరస్కరించాడు.
అమిత్ షా తనయుడు జై షా నెటిజన్లకు బుక్కయ్యారు. ఆసియా కప్ లో భాగంగా జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో సందడి చేసిన జై షా జాతీయ జెండాను అవమానించారు. మ్యాచ్ విజయం అనంతరం చప్పట్లతో టీమిండియాకి శుభాకాంక్షలు చెబుతున్న జైషా కు పక్కనున్నవారు జాతీయ జెండాను అందించారు. కానీ జైషా సున్నితంగా తిరస్కరించాడు. జెండా పట్టుకోవడాన్ని కూడా నామోషీగా భావించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆర్ఎస్ఎస్ వారసత్వమా..?
ఆర్ఎస్ఎస్ నేతలు జాతీయ జెండాను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. ఇటీవల స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ తప్పనిసరి పరిస్థితుల్లో జెండాని తమ సోషల్ మీడియా విభాగాల్లో ఉంచారు కానీ గతంలో ఎప్పుడూ వారు జెండాని లెక్కలోకి తీసుకోలేదు. ఆర్ఎస్ఎస్ తరపున జెండా వందనం సహా ఇతర కార్యక్రమాలేవీ పెద్దగా జరగవనే చెప్పాలి. అలాంటి ఆర్ఎస్ఎస్ వారసత్వంతోనే ఇప్పుడు జై షా జాతీయ జెండాను అవమానించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైషా వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు.
వారసత్వ సంపద..
భారత దేశ వారసత్వ సంపద ఎలా ఉన్నా, ఇతర పార్టీల వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోదీ ఎన్ని సెటైర్లు పేల్చినా.. బీజేపీలోని వారసత్వ రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ జై షా. అమిత్ షా తనయుడు కావడం వల్లే బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఆయనకు అవకాశమొచ్చింది. కనీసం క్రికెట్ తో కానీ, క్రీడలతో కానీ సంబంధం లేని ఫక్తు వ్యాపారవేత్త జై షా. అలాంటి వ్యక్తికి బంగారు బాతులాంటి బీసీసీఐ పీఠాన్ని అప్పగించారు తండ్రి అమిత్ షా. ఇంతకంటే వారసత్వ రాజకీయాలకు ఇంకే ఉదాహరణ కావాలి. కానీ బీజేపీ నేతలు మాత్రం వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అంటారు, టీ అమ్ముకునేవారుకి సైతం ప్రధాని పోస్ట్ దక్కేది బీజేపీలోనే అంటారు. కానీ ఆ టీ అమ్ముకునే వ్యక్తి స్నేహితుడి కొడుకు వేలకోట్ల వ్యాపార లావాదేవీలు జరిపే బీసీసీఐకి ఎలా ప్రెసిడెంట్ కాగలిగారు అనేది మాత్రం ఎవరూ చెప్పరు, చర్చించుకోరు. అలాంటి వ్యక్తి ఇప్పుడిలా జాతీయ జెండాను పట్టుకోనంటూ పక్కనపెట్టినా పెద్దగా పట్టించుకోరు. ఇదే పని ఓ ముస్లిం చేసి ఉంటే ఈపాటికి బీజేపీ నేతలు ఎంత ఓవర్ యాక్షన్ చేసేవారో అందరికీ తెలుసు.