మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. - మంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం
తొలుత ఉదయం తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా సమావేశం నిర్వహించిన అజిత్ పవార్.. అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సైతం అక్కడికి చేరుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కీలక నేత అజిత్ పవార్ అధికార పక్షంలో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భేటీ అయిన ఆయన తన మద్దతుదారులు 9 మందితో కలిసి గవర్నర్‌ను కలిశారు. వెనువెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తొలుత ఉదయం తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా సమావేశం నిర్వహించిన అజిత్ పవార్.. అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సైతం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు అజిత్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పరిణామం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాక్ ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.