ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు కంగారులేదు.. మూడు నెలల గడువు పెంపు
ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు సెప్టెంబర్ 14వరకు గడువు ఉందని తొలుత ప్రకటించాం. దీనికి వస్తున్న స్పందన చూసి, కార్డుదారుల సౌలభ్యం కోసం ఈ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నాం.
ఆధార్ కార్డును ఆన్‌లైన్లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14 చివరి గడువని కేంద్రం ప్రకటించడంతో హడావుడి పడుతున్న కార్డుదారులకు గుడ్‌న్యూస్. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువును మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. దీన్ని తాజాగా ప్రకటించింది.
ఏమిటీ ఫ్రీ ఆధార్ అప్‌డేట్..?
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటి దానిలో వివరాలను ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోనివారి కోసం ఆధార్ అప్‌డేట్‌ను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఈ పదేళ్లలో చిరునామా మారినవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆధార్లో మార్పు చేయాలంటే ప్రతి మార్పునకూ 50 రూపాయల చార్జి చేస్తారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా అప్‌డేటెడ్ ఆధార్ ఉంటే తాజా వివరాలు అందుబాటులో ఉంటాయని ఫ్రీ అప్‌డేషన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకునేవారికే ఫ్రీ ఉంటుంది.
డిసెంబర్ 14 వరకు కొత్త గడువు
`ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు సెప్టెంబర్ 14వరకు గడువు ఉందని తొలుత ప్రకటించాం. దీనికి వస్తున్న స్పందన చూసి, కార్డుదారుల సౌలభ్యం కోసం ఈ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నాం. డిసెంబర్ 14 వరకు గడువు ఉంది. కాబట్టి ఆధార్ కార్డుదారులు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు ` అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.
*