Telugu Global
National

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు, ఏపీలో ఒకటి

దేశంలో ఏపీతో సహా 9 రాష్ట్రాల్లో 21 నకిలీ యూనివర్సిటీలున్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. ఈ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీని అందించకుండా నిషేధించింది.

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు, ఏపీలో ఒకటి
X

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలున్నట్టు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రకటించింది. మరో రెండు యూనివ‌ర్సిటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, యూపీ, ఒడిశా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న 21 నకిలీ యూనివర్సిటీల జాబితాను కమిషన్‌ విడుదల చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీని అందించకుండా నిషేధించింది.

"యుజిసి చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న 21 స్వయం ప్రకటిత‌, గుర్తింపు లేని సంస్థలను నకిలీ విశ్వవిద్యాలయాలుగా ప్రకటిస్తున్నాము. వాటికి ఎటువంటి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదు" అని యుజిసి ఒక ప్రకటనలో పేర్కొంది.


UGC విడుదల చేసిన జాబితా ప్రకారం, ఢిల్లీలో ఎనిమిది నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్ లో 2, ఒడిశా లో 2, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో నకిలీ యూనివర్సిటీ ఉంది.

ఢిల్లీ:

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS),

కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్. దర్యాగంజ్,

యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ,

ఒకేషనల్ యూనివర్సిటీ,

ADR-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ,

ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ మరియు ఇంజనీరింగ్,

స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ,

ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం).

ఉత్తరప్రదేశ్ :

గాంధీ హిందీ విద్యాపీఠం,

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి,

నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ),

భారతీయ శిక్షా పరిషత్.

పశ్చిమ బెంగాల్:

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ,

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్.

ఒడిశా:

నబభారత్ శిక్షా పరిషత్,

నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ.

కర్ణాటక లో బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళ లో సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, మహారాష్ట్ర లో రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, పుదుచ్చేరి లోడి శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్శిటీలు ఈ నకిలీ యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి.

ఈ నకిలీ యూనివర్సిటీల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని UGC కోరింది.

First Published:  27 Aug 2022 9:05 AM IST
Next Story