ఉదయనిధికి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్..!
సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియా కూటమి హిందూత్వాన్ని హేళన చేస్తోందని..దేశ వారసత్వంపై దాడికి దిగుతోందని విమర్శించారు. ఇండియా కూటమి తరపునే స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారని అమిత్ షా ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారభించారు.
ఇక ఉదయనిధి కామెంట్స్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరం స్వాగతించడాన్ని తప్పు పట్టారు అమిత్ షా. రెండు రోజులుగా ఇండియా కూటమి నేతలు భారత వారసత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారన్నారు. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు అమిత్ షా. అతివాద హిందుత్వ సంస్థలు లష్కరేతోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల కంటే భయంకరమైనవంటూ 2010లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు.
తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం ఏర్పాటు చేసిన సనాతన నిర్మూలన సదస్సులో ఉదయనిధి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన
సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని...సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలంటూ కామెంట్ చేశారు. సనాతన ధర్మం తిరోగమన సంస్కృతికి చిహ్నమన్నారు.ప్రజలను కులాల పేరిట విభజించిందన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకమని చెప్పారు.