Telugu Global
National

చిన్న వ్యాపారుల షాపులు కూల్చడానికి బుల్డోజర్లు.....ఒంటికి నిప్పంటించుకున్న వ్యాపారులు...పరిస్థితి విషమం

బీహార్ లోని పాట్నాలో రైల్వే పోలీసులు బుల్డోజర్లు తీసుకొని కొన్ని షాపుల మీద పడ్డారు. అది చూసి షాపు యజమానులు బుల్డోజర్ కు అడ్డుగా నిలబడ్డారు. ఇద్దరు వ్యపారులు తమ శరీరాలకు నిప్పంటించుకున్నారు.

చిన్న వ్యాపారుల షాపులు కూల్చడానికి బుల్డోజర్లు.....ఒంటికి నిప్పంటించుకున్న వ్యాపారులు...పరిస్థితి విషమం
X

ఉత్తరప్రదేశ్ లో మొదలైన బుల్డోజర్ల‌ రాజ్యం దేశమంతా విస్తరిస్తోంది. అది అనేక ప్రమాదాలకు దారి తీస్తోంది. అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నది. ప్రభుత్వాలు తమకు నచ్చనివాళ్ళ ఇళ్ళపైకి బుల్డోజర్లను పంపుతున్నాయనే ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి.

బీహార్ లోని పాట్నాలో రైల్వే పోలీసులు బుల్డోజర్లు తీసుకొని కొన్ని షాపుల మీద పడ్డారు. అది చూసి షాపు యజమానులు బుల్డోజర్ కు అడ్డుగా నిలబడ్డారు. ఇద్దరు వ్యపారులు తమ శరీరాలకు నిప్పంటించుకున్నారు.

పాట్నా అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీగంజ్ గుమ్టి సమీపంలో షాపులు ఉన్న స్థలం తమదే అని రైల్వే శాఖ చెప్తోంది. అయితే ఈ స్తలం తమదే అని 40 ఏళ్ళుగా తాము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నామని వ్యాపారులు చెప్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ నెల 24న ఈ కేసు విచారణ ఉంది.

కేసు కోర్టులో ఉండగానే రైల్వే అధికారులు షాపులను కూల్చడానికి బుల్డోజర్లను, రైల్వే పోలీసులను తీసుకొని అక్కడికి వచ్చారు. బలవంతంగా షాపులను ఖాళీ చేసి బుల్డోజర్లతో కూల్చి వేతలు ప్రారంభించారు. దాంతో ఆందోళన చెందిన వ్యాపారులందరూ పోలీసులను అడ్డుకున్నారు. ఇంతలో 45 ఏళ్ల అనిల్ కుమార్, 55 ఏళ్ల మున్నా కుమార్ లు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం తో వ్యాపారులంతా వాళ్ళను రక్షించే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పి వారిద్దరినీ అపోలో బర్న్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఢిల్లీకి రెఫర్ చేశారు. మరొకరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు..

మరో వైపు ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన వ్యాపారులు రైల్వేపోలీసుల మీద తిరగబడ్డారు. రైల్వేశాఖ తీసుకొచ్చిన జేసీబీపై స్థానికులు రాళ్లు రువ్వారు. పోలీసులపై రాళ్ళతో దాడికి దిగారు. ఈ హటాత్పరిణామంతో కంగుతిన్న పోలీసులు పరుగులందుకున్నారు. బుల్డోజర్ ను తీసుకొని డ్రైవర్ కూడా పారిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

కాగా, ఈ స్థలం తమదేనని, ఈ భూమిలో 40 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం హైకోర్టులో నడుస్తుండగా, మా భూమిని రైల్వే భూమిగా పేర్కొంటూ రైల్వే యంత్రాంగం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, కోర్టు తీర్పు రాకముందే రైల్వే యంత్రాంగం కుట్రలు చేసి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడమేంటని వ్యాపారస్తులు ప్రశ్నించారు. హార్డ్‌వేర్ గూడ్స్ దుకాణదారుడు 45 ఏళ్ల అనిల్ కుమార్ అగ్నిప్రమాదంలో 80% కాలిపోయాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని స్థానిక వ్యాపారులు తెలిపారు.

రైల్వేశాఖ ఇంతకుముందు కూడా నోటీసు పంపిందని, దానికి మేము లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని స్థానిక దుకాణదారులు తెలిపారు. మా కేసు పాట్నా హైకోర్టులో ఉంది. ఈ కేసు 24 ఫిబ్రవరి 2023న విచారణకు రావలసి ఉంది. అయితే హైకోర్టు నిర్ణయానికి ముందే, రైల్వే అధికారులు బలవంతంగా దుకాణాలను ఖాళీ చేయడం ప్రారంభించారు. అని షాపు యజమానులు అంటున్నారు.

రైల్వే శాఖ తీరుపై వ్యాపారస్తులే కాకుండా స్థానికులు, ఆ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  18 Feb 2023 1:07 PM IST
Next Story