Telugu Global
National

రేపు ఉదయం నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56.. అంతరిక్షంలోకి 7 ఉపగ్రహాలు

సీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను అందిస్తుంది.

రేపు ఉదయం నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56.. అంతరిక్షంలోకి 7 ఉపగ్రహాలు
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఏపీలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మరో రాకెట్ ప్రయోగం జరుగనున్నది. ఇస్రోకి చెందిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్‌ను ఆదివారం ఉదయం 6.30 గంటలకు మొదటి లాంఛ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ఇవ్వాళ ఉదయమే ప్రారంభమైంది. 25.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనున్నది.

పీఎస్ఎల్వీ సీ-56 ద్వారా సింగపూర్ దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ అనే ఉపగ్రహాంతో పాటు.. అదే దేశానికి చెందిన మరో 6 నానో ఉపగ్రహాలను ఇస్రో కక్ష్య లోకి ప్రవేశ పెట్టనున్నది. ఇది ఇస్రో చేపట్టిన పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగమని అధికారులు వెల్లడించారు.

సీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను అందిస్తుంది. ఎస్టీ ఇంజనీరింగ్ వాణిజ్య వినియోగదారుల కోసం మల్టీ మోడల్, హై రిజల్యూషన్ చిత్రాలను అందించడంతో పాటు జియో స్పేషియల్ సేవలను అందిస్తుంది.

రేపు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న శాటిలైట్స్..

1. DS-SAR (సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీల కోసం)

2. VELOX-AM (23 కిలోల మైక్రోశాటిలైట్)

3. ARCADE (ఒక ప్రయోగాత్మక ఉపగ్రహం)

4. SCOOB-II (టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ పేలోడ్‌తో కూడిని 3U నానో శాటిలైట్)

5. NuLION (అర్భన్, రిమోట్ ఏరియాల్లో అంతరాయం లేని loT కనెక్టివిటీ కోసం)

6. గెలాసియా-2 (లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే 3U నానో శాటిలైట్)

7. ORB-12 STRIDER (అంతర్జాతీయ సంస్థలతో అభివృద్ధి చేయబడిన శాటిలైట్)


First Published:  29 July 2023 8:34 PM IST
Next Story