Telugu Global
National

రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు నేడే...మరి కొద్ది సేపట్లో శ్రీనగర్ లో బహిరంగ సభ‌

భారత్ జోడో యాత్ర ముగింపులో సందర్భంగా ఉదయం 9:30 గంటలకు కాం గ్రెస్ అధ్య క్షుడు మల్లికార్జున్ ఖర్గే జాతీయ జెం డాను ఆవిష్క రిం చారు. ఉదయం 10 గం టలకు భారత్ జోడో మెమోరియల్‌ను ప్రారం భించారు. అనంతరం ఉదయం 11.30 గం టలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది.

రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు నేడే...మరి కొద్ది సేపట్లో శ్రీనగర్ లో బహిరంగ సభ‌
X

ఐదు నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన 4,000 కి.మీ పాదయాత్రను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ముగించారు. మరికొద్దిసేపట్లో శ్రీనగర్ లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభ కోసం లాంగ్రెస్ పార్టీ 21 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపింది. అయితే ఇందులో 12 పార్టీలుమాత్రమే ఈ సభకు హాజరవుతున్నట్టు ఇప్పటి వరకు ఉన్న సమాచారం.

భారత్ జోడో యాత్ర ముగింపులో సందర్భంగా ఉదయం 9:30 గంటలకు కాం గ్రెస్ అధ్య క్షుడు మల్లికార్జున్ ఖర్గే జాతీయ జెం డాను ఆవిష్క రిం చారు. ఉదయం 10 గం టలకు భారత్ జోడో మెమోరియల్‌ను ప్రారం భించారు. అనంతరం ఉదయం 11.30 గం టలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది.ఈ సభలో కాం గ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ పాల్గొంటా రు.

ఆదివారం సాయంత్రం రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీకి వ్యతిరేకంగా తాము ఏకతాటిపై నిలబడతామని చెప్పారు. “భారత్ జోడో యాత్ర దక్షిణం నుండి ఉత్తరం వరకు జరిగింది. ఇద్ జాతీయ దృక్పధంతో సాగింది… భారతదేశానికి ముందు రెండు రహదారులు ఉన్నాయి… రెండు జీవన మార్గాలు ఉన్నాయి. ఒకటి అణచివేత దృక్పథం, రెండోది అందరినీ ఏకం చేయాలనే దృక్పథం'' అని అన్నారు. "ఈ యాత్ర ముగియలేదు... ఇది మొదటి అడుగు, ప్రారంభం మాత్రమే" అని రాహుల్ అన్నారు.

ద్వే షాన్ని పక్కనబెట్టి భారతదేశం ఏకం కావాలని రాహుల్ గాం ధీ అన్నా రు. భారతదేశాన్ని అనుసం ధానిం చే యాత్ర ముగింపు సం దర్భం గా కాం గ్రెస్ అం దరినీ ఆహ్వానించిందన్నా రు. నరేం ద్ర

మోడీకి వ్య తిరేకంగా ఉన్న వారందరినీ సమీకరించాలన్నా రు. మమతా బెనర్జీ ఎందుకు రావడం లేదని ఆయనను ప్రశ్నించగా.. ఇది వారినే అడగాలన్నారు.

అయితే భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భం గా జరిగే బహిరంగ సభలో కొన్ని ప్రతి పక్ష పార్టీల నేతలు రాకపోవడానికి ప్రతిపక్షాల మధ్య బేధాబిప్రాయాలే కారణమన్నట్టు చిత్రీకరించడం సరికాదన్నారు రాహుల్ గాం ధీ . ఆప్, వైఎసీపీ, బీజేడీ, బీఆర్ఎస్,ఏఐయూడీఎఫ్ మినహా 23 ప్రతిపక్ష పార్టీలను భారత్ జోడో యాత్ర ముగింపు సభకు హాజరు కావాల్సిం దిగా కాంగ్రెస్ ఆహ్వానించింది.

అయితే తృ ణమూల్‌ కాం గ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ(ఎం ), జేడీ(యూ), జేడీ(ఎస్‌) సహా దాదాపు సగం మం ది పెద్ద నేతలను ర్యాలీకి పం పడం లేదు. కాగా కొన్ని పార్టీలు తమ రెం డో లేదా థర్డ్

గ్రేడ్ నేతలను కాం గ్రెస్ ర్యా లీకి హాజరయ్యేందుకు పంపాయి.

First Published:  30 Jan 2023 11:17 AM IST
Next Story