IPL టికెట్లు అడిగిన AIADMK MLA, మీ ఫ్రెండ్ అమిత్ షా కొడుకును అడగమంటూ పంచ్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
మాకు వారు టికెట్లు ఇవ్వరు. మీరే ఆ ప్రయత్నం చేయాలి. బీసీసీఐ సెక్రటరీ, మీ ఆప్త మిత్రుడు అమిత్ షా కుమారుడు జై షా తో మాట్లాడి ఎమ్మెల్యేలందరికీ ఫ్రీ టికెట్లు ఇప్పించండి. వీలయితే ఒక్కో ఎమ్మెల్యేకు 5 టికెట్లు ఇప్పించగల సమర్దత గలవాళ్ళు మీరే. జై షా మా మాట వినడు'' అని అన్నారు ఉదయనిధి.

తమిళనాడులో ఎమ్మెల్యేలందరికీ ఫ్రీ ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎస్పీ వేలుమణి మంగళవారం తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను కోరారు. తమ హయాంలో ఎమ్మెల్యేలందరికీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళమని అన్నారాయన. దానికి జవాబుగా ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన పంచ్ కు ఆ ఎమ్మెల్యే గిల గిలలాడిపోయాడు.
''బీసీసీఐ ప్రభుత్వానికి ఐపీఎల్ ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదు. నా నియోజకవర్గంలోని క్రీడాభిమానులకోసం నేను 150 టికెట్లు కొన్నాను. మాకు వారు టికెట్లు ఇవ్వరు. మీరే ఆ ప్రయత్నం చేయాలి. బీసీసీఐ సెక్రటరీ, మీ ఆప్త మిత్రుడు అమిత్ షా కుమారుడు జై షా తో మాట్లాడి ఎమ్మెల్యేలందరికీ ఫ్రీ టికెట్లు ఇప్పించండి. వీలయితే ఒక్కో ఎమ్మెల్యేకు 5 టికెట్లు ఇప్పించగల సమర్దత గలవాళ్ళు మీరే జై షా మా మాట వినడు'' అని అన్నారు ఉదయనిధి.
ఇద్దరి మధ్య ఈ సంవాదం తమిళనాడు అసెంబ్లీలో జరిగింది. అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎస్పీ వేలుమణి టికెట్లు అడగడం, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ చురకలు వేయడం.. ఈ వ్యవహారాన్నంతా డీఎంకే శాసన సభ్యులే కాక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా నవ్వులు చిందిస్తూ ఆసక్తిగా విన్నారు.