Telugu Global
National

అతనో రాక్షసుడు.. మోదీపై టీఎంసీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

రాముడు తన బాణంతో గుజరాత్ లో అధికారంలో ఉన్న అసురులను సంహరించాలని ఆకాంక్షించారు. అప్పట్లో సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

అతనో రాక్షసుడు.. మోదీపై టీఎంసీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
X

మోదీని కీర్తించే క్రమంలో ఇటీవల గాంధీ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. తమ కుటుంబానికి గాంధీ కుటుంబం అన్యాయం చేసిందని అన్నారాయన. తన తండ్రి కె.సుబ్రహ్మణ్యంను ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ, కేంద్ర కార్యదర్శి పదవినుంచి తొలగించారని గుర్తు చేసుకున్నారు జై శంకర్. అదే సమయంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న తాను, విదేశాంగ శాఖ మంత్రిగా మోదీ హయాంలో ఎదిగానని, బీజేపీనుంచి తనకు అలాంటి ప్రోత్సాహం లభించిందని, అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు.

గతం మరచిపోయావా జైశంకర్..?

కె.సుబ్రహ్మణ్యంను ఇందిరాగాంధీ కేంద్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించిందనే విషయం మాత్రమే జై శంకర్ కి గుర్తుందని, అయితే అదే సుబ్రహ్మణ్యం, మోదీని రాక్షసుడితో పోల్చిన విషయాన్ని ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్. విదేశాంగ మంత్రి జై శంకర్ పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ అల్లర్ల సమయంలో సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు జవహర్ సిర్కార్.


సుబ్రహ్మణ్యం ఏమన్నారు.. ?

2002 గుజరాత్‌ అల్లర్లలో ధర్మ హత్య జరిగిందని, అమాయకులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమై అధర్మానికి పాల్పడిందని అన్నారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం. రాముడు తన బాణంతో గుజరాత్ లో అధికారంలో ఉన్న అసురులను సంహరించాలని ఆకాంక్షించారు. అప్పట్లో సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కానీ ఇప్పుడు ఆయన కొడుకు జై శంకర్, అదే అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడాలని సూచించారు జవహర్ సిర్కార్. అసుర సేవలో ఉన్న జై శంకర్ సిగ్గుపడకుండా, సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెప్పుకోవడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.

First Published:  22 Feb 2023 6:21 PM IST
Next Story