Telugu Global
National

చేతులెత్తేసిన టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్.. 115మంది సిబ్బందిపై వేటు

TISS క్యాంపస్‌లలో మిగిలిన బోధనా సిబ్బంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పేరోల్‌లో ఉన్నారు. తొలగించబడిన వారంతా టాటా ట్రస్ట్ ఇచ్చే గ్రాంట్స్ తో జీతాలు పొందుతున్నారు.

చేతులెత్తేసిన టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్.. 115మంది సిబ్బందిపై వేటు
X

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)కు సంబంధించి నాలుగు క్యాంపస్‌లలో ఒకేసారి 115 మంది సిబ్బందిపై వేటు పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 55 మంది ప్రొఫెసర్లు, 60 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ని ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారు. గౌహతి, ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్ క్యాంపస్ లలో ఈ తొలగింపులు జరిగాయి. టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి TISS కు ప్రతి ఏటా నిధులు విడుదలవుతాయి. అవి ఆగిపోవడం వల్లే ఈ తొలగింపులు జరిగాయని అంటున్నారు.

టాటా వంటి సంస్థలో ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగుల తొలగింపుని ఎవరూ ఊహించరు. నిబద్ధత కలిగిన సంస్థగా పేరున్న టాటా సంస్థ ఉద్యోగుల్ని తొలగించడం సంచలనంగా మారింది. వారంతా పదేళ్లకు పైగా సంస్థతో అనుబంధం ఉన్నవారే. గతంలో ఇతర సంస్థల్లో అంతకు మించిన వేతనంతో అవకాశాలు వచ్చినా, సంస్థ కోసం వారంతా ఆ ఆఫర్లు వదులుకున్నారు. టాటా సంస్థకోసం పనిచేస్తున్న తమను ఇలా అర్థాంతరంగా తొలగించడం అన్యాయం అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధ్యాపకుల్ని తొలగించడం ద్వారా విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

TISS క్యాంపస్‌లలో మిగిలిన బోధనా సిబ్బంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పేరోల్‌లో ఉన్నారు. తొలగించబడిన వారంతా టాటా ట్రస్ట్ ఇచ్చే గ్రాంట్స్ తో జీతాలు పొందుతున్నారు. ఇతర డీమ్డ్-టు-బి-యూనివర్శిటీలు కూడా కేంద్రం నుండి 50 శాతానికి పైగా నిధులు పొందుతున్నాయి. ఉద్యోగుల తరపున TISS కూడా చాలావరకు ప్రయత్నం చేసింది. టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ తో సంప్రదింపులు జరిపింది. కానీ నిధులు విడుదల కాలేదు. దీంతో అనివార్యంగా 115మందిపై వేటు పడింది.

First Published:  30 Jun 2024 12:37 PM IST
Next Story