Telugu Global
National

టిప్పు సుల్తాన్ అనుచరులను చంపేయండి... కర్ణాటక బిజెపి చీఫ్ పిలుపు

''ఈ రాష్ట్రంలో హనుమాన్ భక్తులుండాలా లేదా టిప్పు వారసులుండాలా? టిప్పు అనుచరులు ఈ నేలపై సజీవంగా ఉండకూడదు అని నేను పిలుపునిస్తున్నాను ”అని కర్ణాటక బిజెపి చీఫ్ నళిన్ కుమార్ కటీల్ అన్నారు.

టిప్పు సుల్తాన్ అనుచరులను చంపేయండి...  కర్ణాటక బిజెపి చీఫ్ పిలుపు
X

వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కర్ణాటక బిజెపి చీఫ్ నళిన్ కుమార్ కటీల్, 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ అనుచరులందరిని చంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టిప్పు సుల్తాన్ వారసులను తరిమి కొట్టి అడవులకు పంపాలని ఆయన ప్రకటించారు.

కొప్పల్ జిల్లా యెలబుర్గా పంచాయతీ పట్టణంలో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి కటీల్ మాట్లాడుతూ.. "మేము శ్రీరాముడు, హనుమంతుని భక్తులం. మేము హనుమంతుడికి ప్రార్ధనలు చేస్తాము, మేము టిప్పు వారసులం కాదు. టిప్పు వారసులను ఇంటికి పంపుదాం" అని అన్నారు. .

"మీరు హనుమంతుడికి ప్రార్దనలు చేస్తారా లేక టిప్పుకు ప్రార్థనలు చేస్తారా అని నేను అడుగుతున్నాను. మీరు టిప్పు అనుచరులను అడవికి పంపుతారా? పంపరా ? ఈ రాష్ట్రంలో హనుమాన్ భక్తులుండాలా లేదా టిప్పు వారసులుండాలా? టిప్పు అనుచరులు ఈ నేలపై సజీవంగా ఉండకూడదు అని నేను పిలుపునిస్తున్నాను ”అన్నారాయన.

కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వర్సెస్ హనుమాన్ చర్చను కర్ణాటకలో 2018 ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.

రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు "టిప్పు వర్సెస్ సావర్కర్" అని పేర్కొంటూ కటీల్ వివాదాన్ని సృష్టించారు. అవసరం లేని టిప్పు జయంతి వేడుకలను కాంగ్రెస్ జరుపుకోవడానికి అనుమతించిందని సావర్కర్ గురించి కాంగ్రెస్ నాయకులు అవమానకరంగా మాట్లాడారని ఆయన అన్నారు.

కర్నాటకలో ఎన్నికలు దగ్గరికొస్తున్నా కొద్ది బీజేపీ ప్రజా సమస్యలను పక్కనపెట్టి, టిప్పూ సుల్తాన్, లవ్ జీహాదీ, హిజాబ్ తదితర నినాదాలను ప్రచారం చేస్తున్నది.

First Published:  16 Feb 2023 6:55 AM IST
Next Story