Telugu Global
National

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌పై 12 రోజుల్లో మూడు రాళ్ళ దాడులు

జనవరి 11వ తేదీ బుధవారం విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద కొత్త వందే భారత్ రైలు కోచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. దుండగుల కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌పై 12 రోజుల్లో మూడు రాళ్ళ దాడులు
X

దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళపై 12 రోజుల్లో 3 రాళ్ళ దాడులుజరిగాయి. ఎందుకు దుండగులు వందేభారత్ రైళ్ళను టార్గెట్ చేసున్నారన్నది పోలీసులకు కూడా అర్దం కాని పరిస్థితి.

రెండురోజుల క్రితం విశాఖపట్నంలో వందేభారత్ రైలుపై రాళ్ళ దాడి జరిగింది. సికి‍ందరాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడిచే ఈ రైలును ఈ నెల 15న ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభింస్తారు. ఈలోపు రైలును ట్రయల రన్ కోసం చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చిన సందర్భంగా ఈ రాళ్ళ దాడి జరిగింది.

జనవరి 11వ తేదీ బుధవారం విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద కొత్త వందే భారత్ రైలు కోచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. దుండగుల కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కానీ ఇది మొదటి సంఘటన కాదు. 30 డిసెంబర్ 2022న బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన‌ రెండు రోజులకే, దాని తలుపుల అద్దాలపై రాళ్ల దాడి జరిగింది. రైలు న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు చేరుకునేలోపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కోచ్‌లలో ఒక్కో కిటికీ గ్లాసులు దెబ్బతిన్నాయి.

ఇది రాజకీయ వైరానికి దారి తీసింది. రాళ్ల దాడి ఘటన భారతీయ జనతా పార్టీ (బిజెపి) , తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మధ్య బ్లేమ్ గేమ్‌కు దారితీసింది.

జనవరి 2న మాల్దా జిల్లాలో, మరుసటి రోజు బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈ రైళ్ళపై రాళ్ల దాడి జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది.

ఈ అన్ని ఘటనలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ఉమ్మడి బృందాలు అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. అయితే ఇలా వందే భారత్ రైళ్ళ మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయనే ప్రశ్నకు పోలీసులు కానీ, రైల్వే అధికారులు కానీ జవాబు తెలుసుకోలేకపోయారు.

First Published:  13 Jan 2023 8:36 AM IST
Next Story