Telugu Global
National

రెజ్లర్లకు అండగా నిలిచిన కిసాన్ మోర్చా... ఢిల్లీకి చేరుకుంటున్న వేల మంది రైతులు

బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.ఈ రోజు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల నుండి సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, వందలాది మంది రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు.

రెజ్లర్లకు అండగా నిలిచిన కిసాన్ మోర్చా... ఢిల్లీకి చేరుకుంటున్న వేల మంది రైతులు
X

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొద్ది రోజులుగాధర్నా చేస్తున్న రెజ్లర్లకు రైతులు మద్దతు ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో వేలాదిగా రైతులు జంతర్ మంతర్ కు తరలి వస్తున్నారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, ఇతర ప్రముఖ రెజ్ల‌ర్లు ఏప్రిల్ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు.

కాగా, రెజ్లర్ల‌కు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్‌లో రైతులు దేశ‌ వ్యాప్త ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ప్రకటించారు.

బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.

ఈ రోజు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల నుండి సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, వందలాది మంది రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు.

బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్, కేంద్ర క్రీడా మంత్రి, కేంద్ర హోంమంత్రి వద్దకు SKM నాయకుల ప్రతినిధి బృందం కూడా వెళ్ళనుంది.

మే 11-18 వరకు అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లాల్లో రైతు సంఘం ఆందోళనల‌ను నిర్వహించనుంది.

ఢిల్లీ పోలీసులు ధర్నా చేస్తున్న రెజ్లర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని SKM ఆరోపించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్ల‌కు ప్రాథమిక పౌర హక్కులను నిరాకరించడాన్ని ఖండించింది.

మరో వైపు వేలాదిగా రైతులు జంతర్ మంతర్ కు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

First Published:  7 May 2023 11:10 AM IST
Next Story