Telugu Global
National

ఇది ఆరురోజుల క్రితం మోడీ ప్రారంభించిన హైవే...ఒక్క సారి దీని పరిస్థితిని చూడండి!

కర్నాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నందున హైవే పనులు పూర్తి చేయకుండానే ప్రధాని మోడీ ఈ హైవేను ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు పనులు పూర్తి చేయకుండా టోల్ వసూలు చేయడంపై జనతాదళ్ (సెక్యులర్) సహా రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టాయి.

ఇది ఆరురోజుల క్రితం మోడీ ప్రారంభించిన హైవే...ఒక్క సారి దీని పరిస్థితిని చూడండి!
X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే శనివారం ఉదయం చిన్నపాటి వర్షం వల్ల‌ నీటితో నిండిపోయి ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. అనేక కార్లు , ఇతర వాహనాలు నీళ్ళలో మునిగిపోయాయి. ఆక్సిడెంట్లయ్యాయి.

ఒక సారి ఈ వీడియో చూడండి....

గత ఆగస్టులో వర్షాల కారణంగా ఇదే హైవే నీళ్ళతో నిండిపోయింది. ఈ ఏడాది జనవరిలో రహదారిని సందర్శించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మళ్ళీ ఈ సమస్య రాకుండా సాంకేతిక బృందం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు.

రూ. 8,480 కోట్ల నిధులతో NH-275లోని బెంగళూరు-మైసూరు సెక్షన్‌ను ఆరు వరుసలుగా మార్చారు.మార్చి 12న 118 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటల నుండి 75 నిమిషాలకు తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.NHAI మంగళవారం నుంచి టోల్ వసూలు కూడా ప్రారంభించింది.

ఇక ఈ రోజు పరిస్థితి చూస్తే అసలు ఈ రోడ్డుకోసం విడుదలైన నిధులు ఖర్చుపెట్టారా అనే అనుమానం కలగక మానదు. ఇప్పుడు చిన్న వానకే వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. అసలు ఈ హైవేని పూర్తిగా సిద్ధం చేశాకే ప్రారంభించారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘నా మారుతి స్విఫ్ట్ కారు నీళ్లలోనే సగం మునిగిపోయింది. దీంతో అక్కడే ఆగిపోయింది. వెనుక నుంచి వచ్చిన లారీ గుద్దేసింది. దీనికి ఎవరు బాధ్యులు? నా కారును రిపేర్ చేయించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని కోరుతున్నా’’ అని వికాస్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. హైవేని ప్రారంభించే ముందు చెక్ చేశారా? అని ప్రధానిని ఆయన ప్రశ్నించారు.

కర్నాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నందున హైవే పనులు పూర్తి చేయకుండానే ప్రధాని మోడీ ఈ హైవేను ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు పనులు పూర్తి చేయకుండా టోల్ వసూలు చేయడంపై జనతాదళ్ (సెక్యులర్) సహా రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టాయి.

First Published:  18 March 2023 9:25 AM GMT
Next Story