ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసింది
కుంభమేళాలో ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచిందన్న మోడీ

అందరి సహకారంతో మహాకుంభమేళా విజయవంతమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచం మొత్తం భారత దేశ శక్తిని చూసిందని కొనియాడారు. లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు, మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసింది. భారత వైభవం ప్రపంచం మొత్తం చూసింది. కుంభమేళాలో ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచింది, ఈ విజయం అందరి కృషి ఫలితమని మోడీ అన్నారు.
ఎర్రకోట నుంచి సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ ప్రాముఖ్యాన్ని నేను ప్రధానంగా ప్రస్తావించాను. గత ఏడాడి శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం ఎలా పులకించిపోయిందో చూశాం. కుంభమేళాలోనూ అలాంటి ఐక్యతే కనిపించింది. ప్రపంచం మొత్తం భారత శక్తిసామర్థ్యాలను ఈ రూపంలో చూసింద. మన బలానక్ని అవమానించేవారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్తతరం గౌరవంతో స్వీకరిస్తున్నదని మోడీ అన్నారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభ వాయిదా పడింది.