కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
BY Vamshi Kotas26 Jan 2025 10:45 AM IST
X
Vamshi Kotas Updated On: 26 Jan 2025 10:45 AM IST
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 76వ గణతంత్ర వేడుకలకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్షనేతలు, రాజకీయ, సినీ క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
Next Story