అదానీ స్కాం పై ఈ రోజు కూడా దద్దరిల్లిన పార్లమెంటు...సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్
ఈ రోజు సభ ప్రారంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరిగి తీరాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో విపక్షాలు వెల్ లోకి దూసుకెళ్ళాయి.
అదానీ గ్రూప్ కంపెనీల స్కాం నేపథ్యంలో పార్లమెంటు రెండవరోజు కూడా సజావుగా నడవలేదు. రాజ్యసభ, లోక్ సభ రెండూ సోమవారానికి వాయిదా పడ్డాయి.
ఈ రోజు సభ ప్రారంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరిగి తీరాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో విపక్షాలు వెల్ లోకి దూసుకెళ్ళాయి.కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ, జేపీసీ కానీ సీజేఐ తో కానీ విచారణ జరిపించాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
రాజ్యసభలో కూడా లోక్ సభ సీనే రిపీట్ అవడంతో చైర్మెన్ జగదీప్ ధంకర్ సభను వాయిదా వేశారు.
ఈరోజు ఉదయం, అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం సమస్యపై వ్యూహాన్ని సమన్వయం చేయడానికి పార్లమెంటు హౌస్‌లోని ప్రతిపక్ష నాయకుడు (రాజ్యసభలో) మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్‌లు సమావేశమయ్యారు.
రెండు సభలు తిరిగి ఫిబ్రవరి 6న ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి.
.