Telugu Global
National

బీజేపీ పాలనలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 కోట్లు

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం, 2014, 2023 మధ్య భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సంఖ్య దాదాపు 10 కోట్లుగా అంచనా వేయబడింది. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక మందగమనం కాగా ఆటోమేషన్ పెరుగుదల, COVID-19 మహమ్మారితో సహా పెద్ద నోట్ల రద్దు వంటి వివిధ కారణాలు కూడా కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమయ్యాయి.

బీజేపీ పాలనలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 కోట్లు
X

2014 లో బీజేపీ గెలిచి మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 10 కోట్ల కు పైగా కార్మికులు, ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాము అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోడీ ఆ హామీని పూర్తి చేయలేదు కానీ ఆవరేజ్ గా సంవత్సరానికి ఒక కోటి మందికి పైగా ఉద్యోగాలు మాత్రం కోల్పోయారు.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం, 2014, 2023 మధ్య భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సంఖ్య దాదాపు 10 కోట్లుగా అంచనా వేయబడింది. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక మందగమనం కాగా ఆటోమేషన్ పెరుగుదల, COVID-19 మహమ్మారితో సహా పెద్ద నోట్ల రద్దు వంటి వివిధ కారణాలు కూడా కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమయ్యాయి.

భారతదేశంలో ఆర్థిక మందగమనం జాబ్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దేశం GDP వృద్ధి రేటు 2014లో 7.5% ఉండగా 2022లో 4.2%కి తగ్గింది. దీనివల్ల వస్తు, సేవల రంగాల్లో డిమాండ్ తగ్గుముఖం పట్టింది, ఫలితంగా ఉద్యోగాలు పోయాయి.

ఆటోమేషన్ పెరగడం భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోవడానికి మరో కారణం. తయారీ, వ్యవసాయం, రిటైల్ రంగాల‌తో సహా వివిధ పరిశ్రమలలో కార్మికులను ఆటోమేషన్ భర్తీ చేస్తోంది. దీని వల్ల అనేక మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు పెద్ద ఎత్తున‌ ఉపాధిని కోల్పోయారు.

COVID-19 మహమ్మారి భారతదేశంలోని ఉద్యోగ మార్కెట్‌పై కూడా వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దీని వల్ల లక్షల మంది తమ‌ వ్యాపారాలను మూసివేయవలసి వచ్చింది. కరోనా, లాక్ డౌన్ వల్ల వస్తువుల, సేవలకు డిమాండ్ తగ్గింది. దీని వల్ల మరింత మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత అనేక చిన్న, మధ్య‌ తరహా వ్యాపారాలు మూసువేసుకోవాల్సి వచ్చింది. దీని కారణంగా కూడా లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.

భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్య దేశ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. నిరుద్యోగులు జీవనం సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వారు పేదరికం, పోషకాహార లోపం వంటి అనేక సామాజిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ రేటు సామాజిక అశాంతికి కూడా దారితీసింది.

First Published:  12 May 2023 9:49 AM IST
Next Story