Telugu Global
National

గులామ్ నబీ ఆజాద్ కు ముఖ్యఅనుచరుల షాక్ ..తిరిగి కాంగ్రెస్ లో చేరిన 17 మంది

ఢిల్లీలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆ నాయకులను పార్టీలోకి స్వాగతించారు. భారత్ ''జోడో యాత్ర‌ రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో వారు తమ స్వంత ఇంటికి తిరిగి వస్తున్నందున ఆనందంగా ఉంది'' అని వేణుగోపాల్ అన్నారు.

గులామ్ నబీ ఆజాద్ కు ముఖ్యఅనుచరుల షాక్ ..తిరిగి కాంగ్రెస్ లో చేరిన 17 మంది
X

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జమ్ము కశ్మీర్ లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (DAP) అనే స్వంత పార్టీని ఏర్పాటు చేసిన గులాం నబీ ఆజాద్ కు ఆయన ముఖ్య అనుచరులైన నాయకులు షాక్ ఇచ్చారు. ఆజాద్ తో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ పిసిసి చీఫ్ పీర్జాదా మహ్మద్ సయీద్‌తో సహా 17 మంది నాయకులు రెండు నెల‌ల్లోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

ఢిల్లీలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆ నాయకులను పార్టీలోకి స్వాగతించారు. భారత్ ''జోడో యాత్ర‌ రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో వారు తమ స్వంత ఇంటికి తిరిగి వస్తున్నందున ఆనందంగా ఉంది'' అని వేణుగోపాల్ అన్నారు.

"భారత్ జోడో యాత్ర దేశంలో పెద్ద ఉద్యమంగా మారింది, అందుకే ఈ నాయకులందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని నిర్ణయించుకున్నారు" అని ఆయన విలేకరులతో అన్నారు.

“ఇది ప్రారంభం మాత్రమే. యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించినప్పుడు, కాంగ్రెస్ భావజాలం ఉన్న, భారతదేశ ఐక్యతను కోరుకునే వారందరూ పార్టీలో చేరతారు. ”అని ఆయన అన్నారు.

ఆజాద్‌ను భారత్ జోడో యాత్రకు ఆహ్వానించారా లేదా అనే అంశంపై ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ సిద్ధాంతాలను విశ్వసించే వారిని ప్రతి ఒక్కరినీ భారత్ జోడో యాత్రలో చేరడానికి స్వాగతిస్తున్నాం” అన్నారు. “యాత్రలో చేరాలని మేము అన్ని భావాలు గల పార్టీలను ఆహ్వానించాము,” అని ఆయన చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా సయీద్ లు యాత్రలో చేరి శ్రీనగర్‌లో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తారు.

కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ, “ఈ రోజు మొత్తం 19 మంది నాయకులు చేరాల్సి ఉంది. కానీ 17 మంది ఈ రోజు ఢిల్లీకి వచ్చి చేరగలిగారు. ఇది మొదటి దశ మాత్రమే. మిగతావారు కూడా త్వరలో చేరతారు”.అన్నారు.

కాంగ్రెస్‌ నుంచి ఎందుకు వైదొలిగారు అని అడిగిన ప్రశ్నకు తారా చంద్‌, “మేము భావోద్వేగాలు, స్నేహం కారణంగా తొందరపడి పార్టీని విడిచిపెట్టాం” అని అన్నారు.

తిరిగి ఎందుకు కాంగ్రెస్ లో చేరారు అనేదానిపై, మేము మా జీవితంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ లోనే ఉన్నాం. పార్టీని వీడిపోయినందుకు చాలా బాధపడ్డాం.ఇప్పుడు మా తప్పును గ్రహించాం. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (DAP)లో మేము ఆనందంగా లేము” అని ఆయన అన్నారు.

First Published:  6 Jan 2023 8:57 PM IST
Next Story