Telugu Global
National

లవర్ ని కాల్చి చంపి.. తాను కాల్చుకున్నా పేలని గన్.. అప్పుడు జరిగింది షాకింగ్ ట్విస్ట్

ముంబైలోని బోయిసర్ లో ఓ యువకుడు తన ప్రియురాలిని పట్టపగలే దారుణంగా గన్ తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్ తో తాను కూడా కాల్చుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు.

లవర్ ని కాల్చి చంపి.. తాను కాల్చుకున్నా పేలని గన్.. అప్పుడు జరిగింది షాకింగ్ ట్విస్ట్
X

ముంబైలోని బోయిసర్ లో ఓ యువకుడు తన ప్రియురాలిని పట్టపగలే దారుణంగా గన్ తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్ తో తాను కూడా కాల్చుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ తుపాకీ పేలలేదు. దీంతో అతడు సంఘటనా స్థలం నుంచి పారిపోతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు మృతి చెందాడు.యువకుడు ప్రియురాలిని గన్ తో కాల్చేటప్పుడు ఆ దృశ్యాలు అక్కడి సమీపంలోని ఒక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బోయి సర్ లోని సరావలి గ్రామంలో టిమా ఆస్పత్రి సమీపంలో శ్రీకృష్ణ యాదవ్, అతడి ప్రియురాలు నేహా మహా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో ఒక విషయమై వాగ్వాదం జరుగుతోంది. అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఉన్నట్టుండి శ్రీకృష్ణ యాదవ్ ఒక గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో నేహా తలపై పెట్టి కాల్చాడు. వెంటనే నేహా అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది.

ఆ వెంటనే శ్రీకృష్ణ యాదవ్ కూడా అదే గన్ ను తన నుదుటిపై పెట్టుకుని కాల్చుకున్నాడు. అయితే అది పేలలేదు. దీంతో అతడు సంఘటనా స్థలం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అన్నీ అక్కడి సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. శ్రీకృష్ణ పారిపోతున్న సమయంలో అతడిని ఒక గుర్తు లేని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు అతడిని వెంటనే సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు తన తన ప్రియురాలిని పట్ట పగలు నడిరోడ్డుపై కాల్చడం, ఆపై తానూ కాల్చుకోవడానికి ప్రయత్నించడం, అది పేలక పోవడంతో పారిపోతూ ప్రమాదానికి గురవడం ఘటనలు ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించాయి.

First Published:  30 Sept 2022 11:45 AM IST
Next Story