Telugu Global
National

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్.. ఓ నాన్సెన్స్ మూవీ.. - ప్ర‌కాశ్‌రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

The Kashmir Files: సిగ్గులేకుండా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి ఆస్కార్ ఎందుకు రాద‌ని అడిగార‌న్నారు. `ది క‌శ్మీర్ ఫైల్స్‌` సినిమాకు ఆస్కార్ అవార్డు కాదు క‌దా.. క‌నీసం భాస్క‌ర్ అవార్డు కూడా రాద‌ని ప్ర‌కాశ్‌రాజ్ విమ‌ర్శించారు.

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్.. ఓ నాన్సెన్స్ మూవీ.. - ప్ర‌కాశ్‌రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు
X

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్.. ఓ నాన్సెన్స్ మూవీ.. - ప్ర‌కాశ్‌రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

`ది క‌శ్మీర్ ఫైల్స్‌` ఒక‌ నాన్సెన్స్ మూవీ అని సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 6వ తేదీన కేర‌ళ‌లో జ‌రిగిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌లో ఆయ‌న మాట్లాడారు.


ఈ సంద‌ర్భంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రిపై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ సినిమా ఎవ‌రు నిర్మించారో త‌మ‌కు తెలుస‌ని, అంత‌ర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మి వేసింద‌ని ఘాటుగా విమ‌ర్శించారు.


అయినా సిగ్గులేకుండా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి ఆస్కార్ ఎందుకు రాద‌ని అడిగార‌న్నారు. `ది క‌శ్మీర్ ఫైల్స్‌` సినిమాకు ఆస్కార్ అవార్డు కాదు క‌దా.. క‌నీసం భాస్క‌ర్ అవార్డు కూడా రాద‌ని ప్ర‌కాశ్‌రాజ్ విమ‌ర్శించారు.

ఇటీవ‌ల విడుద‌లై రికార్డు క‌లెక్ష‌న్ల‌తో విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న షారూక్‌ఖాన్ చిత్రం `ప‌ఠాన్` మూవీపై ప్ర‌కాశ్ రాజ్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌ఠాన్ సినిమాను బాలీవుడ్ బాయ్‌కాట్ చేయాల‌న్న‌వారికి రూ.700 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌తో త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు.

First Published:  8 Feb 2023 5:54 PM IST
Next Story