బీబీసీ అకౌంట్స్ లో అక్రమాలున్నాయని ప్రకటించిన ఐటీ శాఖ
''వివిధ భారతీయ భాషలలో (ఇంగ్లీష్ కాకుండా) కంటెంట్ పెద్ద ఎత్తున వినియోగం ఉన్నప్పటికీ, ఆ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం/లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సర్వే వెల్లడించింది. భారతదేశంలో వచ్చిన ఆదాయం పై పన్ను చెల్లించలేదని అనేక ఆధారాలను సర్వే సమయంలో డిపార్ట్‌మెంట్ సేకరించింది.''అని ఐటీ శాఖ తెలిపింది.
బీబీసీ ఇండియా అకౌంట్స్ లో అవకతవకలున్నాయని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) శాఖ పేర్కొంది. బీబీసీ, ముంబై, ఢిల్లీ కార్యాలయాలపై ఐటీ శాఖ సర్వేకు సంబందించి ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
''ఆదాయపు పన్ను చట్టం, 1961(చట్టం)లోని సెక్షన్ 133A కింద ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ గ్రూప్ సంస్థల బిజినెస్ కాంప్లెక్స్ లో ఒక సర్వే చేశాము. ఆ గ్రూపు ఇంగ్లీష్, హిందీ, అనేక ఇతర భారతీయ భాషలలో కంటెంట్ అభివృద్ధి వ్యాపారంలో ఉంది.'' అని ప్రకటన పేర్కొంది.
''వివిధ భారతీయ భాషలలో (ఇంగ్లీష్ కాకుండా) కంటెంట్ పెద్ద ఎత్తున వినియోగం ఉన్నప్పటికీ, ఆ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం/లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సర్వే వెల్లడించింది. భారతదేశంలో వచ్చిన ఆదాయం పై పన్ను చెల్లించలేదని అనేక ఆధారాలను సర్వే సమయంలో డిపార్ట్‌మెంట్ సేకరించింది.''అని ఐటీ శాఖ తెలిపింది.
సర్వే ఆపరేషన్ ద్వారా ఉద్యోగుల స్టేట్‌మెంట్, డిజిటల్ సాక్ష్యాలు, పత్రాల ద్వారా కీలకమైన సాక్ష్యాలను వెలికితీశామని, వాటిన్నింటిని త్వరలోనే పరిశీలిస్తామని ఐటీ శాఖ తెలిపింది.
కాగా, ఇప్పటికీ ఇంకా ఐటీ శాఖ సర్వే సాగుతోంది. మొదటి మూడురోజులు ఉద్యోగులను కార్యాలయంలోకి అనుమతించని ఐటీ అధికారులు ఈ రోజు నుండి ఉద్యోగులను అనుమతిస్తున్నారు. ముఖ్యంగా, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ సెక్షన్ లను ఐటీ శాఖ పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంది. ఆయా సెక్షన్ లలోని ఉద్యోగులను ఇప్పటికీ ప్రశ్నిస్తోంది. ఆ సెక్షన్ ల లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లన్నింటినీ ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.