Telugu Global
National

నాయ‌కుల డిమాండ్ కు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం..

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలుజరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను బహిర్గత‌ పర్చాలన్న కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ను అధిష్టానం అంగీకరించింది. ఈ జాబితా సెప్టెంబర్ 20 నుంచి పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని కాంగ్రెస్ నేత, ఎన్నిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.

నాయ‌కుల డిమాండ్ కు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం..
X

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయ‌కుల మాట‌లు, వారి అభిప్రాయాల‌ను వింటోంది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో సీనియ‌ర్ నాయ‌కుల డిమాండ్ తో పోలింగ్ ప్ర‌క్రియ‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చేసేందుకు పార్టీ నాయ‌క‌త్వం అంగీక‌రించింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలనుకునే ఎవరైనా ఎలక్టోరల్ కాలేజీ రూపొందించే మొత్తం 9,000 మంది ప్రతినిధుల జాబితాను చూడగలరు. ఈ జాబితా సెప్టెంబర్ 20 నుంచి పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని కాంగ్రెస్ నేత, ఎన్నిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.

శశి థరూర్, కార్తీ చిదంబరం, మనీష్ తివారీ సహా ఐదుగురు ఎంపీలు ఎన్నికల ప్రక్రియలో "పారదర్శకత, నిష్పాక్షిక‌త‌ అంశాల‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. ఇదే విష‌యాల‌ను వివ‌రిస్తూ ఓట‌ర్ల జాబితాను పోటీలో పాల్గొనేవారంద‌రికీ అందుబాటులో ఉంచాలంటూ మిస్త్రీకి లేఖ రాశారు. ఈ లేక రాసిన తర్వాతనే నాయ‌క‌త్వం ఈ జాబితాను బ‌హివ‌ర్గ‌తం చేయాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు 10 మంది ప్రతినిధుల పేర్లను తనిఖీ చేసుకోవచ్చని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీ చెప్పారు.

నామినేషన్‌పై సంతకం చేసి ప్రధాన రిటర్నింగ్ అధికారికి అందజేయగానే ప్రతినిధుల జాబితా మొత్తం అభ్య‌ర్ధికి అందుతుందని ఎంపీలకు రాసిన లేఖలో తెలిపారు. "ఎవరైనా వివిధ రాష్ట్రాల నుండి పది మంది మద్దతుదారుల నుండి నామినేషన్లు పొందాలనుకుంటే, మొత్తం 9000 పైచిలుకు ప్రతినిధుల జాబితా సెప్టెంబర్ 20 వ‌ తేదీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎఐసిసి ఢిల్లీలోని త‌న కార్యాలయంలో సెప్టెంబర్ 24న నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. ," అన్నారాయన. "వారు వచ్చి జాబితా నుండి తమ 10 మంది మద్దతుదారులను ఎంపిక చేసుకోవచ్చు. నామినేషన్ కోసం వారి (ప్రతినిధుల) సంతకాన్ని పొందవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ప్ర‌తినిధుల పేర్లు తెలియ‌కుండా నామినేష‌న్ వేయ‌డం ఎలా అనే వారి ఆందోళ‌న తొల‌గిసోతుంద‌ని భావిస్తున్నాన‌న్నారు. నామినేషన్ పై సంతకం చేసి చీఫ్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన తర్వాత, వారు ప్రతినిధుల మొత్తం జాబితాను పొందుతారు. "ఇది మీకు, లేఖపై సంతకం చేసిన ఇతర కొలీగ్స్ కు సంతృప్తి క‌లిగిస్తుంద‌ని , మీ అవ‌స‌రాల‌ను తీర్చగలదని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నాకు ఫోన్ చేసి, సంభాషించినందుకు శశి జీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా, మిస్త్రీ లేఖ‌పై శ‌శి థ‌రూర్ స్పందిస్తూ.. ఆయ‌న చ‌ర్య‌ను స్వాగ‌తిస్తూ, ట్వీట్ చేశారు. "మా లేఖకు ఆయన నిర్మాణాత్మక సమాధానం రూపంలో ఈ స్పష్టత వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ హామీల దృష్ట్యా, నేను సంతృప్తి చెందాను. చాలా మంది దీనికి సంతోషిస్తారు. ఎన్నికల ప్రక్రియ నా దృష్టిలో పార్టీని బలోపేతం చేస్తుంది. అని పేర్కొన్నారు.

First Published:  11 Sept 2022 2:55 PM IST
Next Story