శ్రీనగర్‌లో మైనస్ 0.8గా నమోదైన ఉష్ణోగ్రతలు
Srinagar Weather Report: జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో బుధవారం రాత్రి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయిందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 0.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాస్త్రవేత్త ఎం. హుస్సేన్ మీర్ తెలిపారు.

Srinagar Weather Report
ఈ శీతాకాలంలో జమ్మూ-కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో అయితే, రాత్రి సమయంలో మంచు గడ్డకట్టే స్థాయి ఉష్ణోగ్రతల కంటే దిగువకు పడిపోతోంది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో బుధవారం రాత్రి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయిందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 0.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాస్త్రవేత్త ఎం. హుస్సేన్ మీర్ తెలిపారు. ఈ విపరీతమైన చలి స్కూలు విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. గడ్డకట్టే మంచు, చలిలో విద్యార్థులు స్కూలుకు రావడానికి ఆసక్తి చూపడం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పెద్దలు కూడా తీవ్రమైన చలిని తట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కాశ్మీర్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉన్న పహల్గామ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 4.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది, ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్ మైనస్ 3.8 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. కుప్వారాలో మైనస్ 2.9 డిగ్రీల సెల్సియస్, ఖాజిగుండ్‌లో మైనస్ 1.6 డిగ్రీలు, కోకెర్‌నాగ్‌లో 0.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్యారా జిల్లాలోని మచిల్ ప్రాంతంలో భరించలేని చలి, మంచు కారణంగా ముగ్గురు భారత సైనికులు వీరమరణం పొందారు.