స్వచ్ఛ భారత్‌లో తెలంగాణకు 13 అవార్డులు
స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ 13 అవార్డులు సాధించింది. వాల్ పేయింటింగ్ , బయోడీగ్రేడబుల్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్, పాస్టిక్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్, గోబర్‌ధాన్, గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ సౌత్‌జోన్ కేటగిరీల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున అవార్డులు వచ్చాయి. 13 అవార్డులు గెల్చుకొని పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది.
వాల్ పేయింటింగ్ , బయోడీగ్రేడబుల్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్, పాస్టిక్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్, గోబర్‌ధాన్, గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ సౌత్‌జోన్ కేటగిరీల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.
జిల్లాల కేటగిరిలో జగిత్యాల రెండో స్థానంలో, నిజామాబాద్ మూడోస్థానంలో నిలిచాయి. అలాగే స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ (ఎస్‌ఎస్‌జీ) సౌత్ కేటగిరిలో నిజామాబాద్ రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో స్థానంను సాధించాయి.
నేషనల్ ఫిల్మ్ కాంపిటిషన్ (జీపీ)లో రాష్ట్రానికి చెందిన ఎక్కూరు మండలం నూకలంపాడు గ్రామం రెండోస్థానంలో నిలువగా సుజలాం 1.0 క్యాంపెయిన్లో తెలంగాణ మూడవ స్థానంలో, సుజలాం 2.0 క్యాంపెయిన్లో రెండవ స్థానాల్లో నిలిచింది.
వీటికి సంబంధించిన అవార్డులను అక్టోబర్ 2న రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు.