Telugu Global
National

నడిరోడ్డుపై వేధింపులు.. యువకుడిని చితక్కొట్టిన అక్కాచెల్లెళ్లు

రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లలో ఒకరికి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇద్దరూ కలిసి అతడిని పట్టుకొని విచక్షణారహితంగా కొట్టారు.

నడిరోడ్డుపై వేధింపులు.. యువకుడిని చితక్కొట్టిన అక్కాచెల్లెళ్లు
X

తమను కొద్దిరోజులుగా వెంటపడి లైంగికంగా వేధిస్తున్న యువకుడికి అక్కాచెల్లెళ్లు తగిన బుద్ధి చెప్పారు. నడిరోడ్డుపై అతడిని కిందపడేసి చితక్కొట్టారు. కాలితో తన్నుతూ.. బెల్ట్‌తో ఒళ్లు వాచిపోయేలా కొట్టారు. ఈ సంఘటన శనివారం జరగగా.. యువకుడికి అక్కాచెల్లెళ్లు బుద్ధి చెబుతున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన విజయ్ సర్కారే కొద్ది రోజుల నుంచి అక్కాచెల్లెళ్ల వెంటపడి లైంగికంగా వేధిస్తున్నాడు. రోజూ అక్కాచెల్లెళ్లు కళాశాలకు వెళ్లేందుకు రోడ్డుపైకి చేరుకోగానే విజయ్ వారిని అనుసరించేవాడు. ఇలా నిత్యం ఆ ఇద్దరు యువతుల వెంట పడుతూ వెకిలి చేష్టలు చేసేవాడు. అయినా వారు మౌనంగా ఉంటూ అతడి వేధింపులను భరించేవారు. యువతులు ఎదురు తిరగకపోవడాన్ని అలుసుగా తీసుకున్న విజయ్ మరింత రెచ్చిపోయాడు.

రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లలో ఒకరికి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇద్దరూ కలిసి అతడిని పట్టుకొని విచక్షణారహితంగా కొట్టారు. కిందపడేసి కాలితో తన్నారు. ఓ అమ్మాయి బెల్టు తీసుకొని యువకుడిపై ఇష్టం వచ్చినట్లు దాడిచేసింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు యువతులకు మద్దతు తెలిపారు. ఆకతాయికి సరైన బుద్ధి చెప్పారని అభినందించారు. ఈ కాలంలో అమ్మాయిలు ఇలాగే ఉండాలని, లేకపోతే ఈ సమాజంలో బతకడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  25 Jun 2023 10:19 AM IST
Next Story