తండ్రి, తమ్ముడిని చంపి.. ఫ్రిజ్‌లో పెట్టిన 15 ఏళ్ల బాలిక
ప్రియుడిని జైల్లో పెట్టించి, తన ప్రేమకు అడ్డుపడుతున్నారని తండ్రి, సోదరుడిపై కక్ష పెంచుకుంది ఆ బాలిక. ప్రియుడు ముకుల్ జైలు నుంచి విడుదలైన అనంతరం అతనితో కలిసి ఇంటికి వెళ్లి తండ్రిని, సోదరుడిని చంపేసింది.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తండ్రిని, తమ్ముడిని చంపి వారి శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టింది 15 ఏళ్ల బాలిక. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో తాజాగా నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాటర్‌లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ జబల్పూర్‌లో 15 ఏళ్ల బాలిక.. స్థానికంగా ఉండే ముకుల్ సింగ్ (19)తో ప్రేమలో పడింది. ఇంట్లో వాళ్లకు విషయం తెలియడంతో వాళ్లు మందలించారు. దీంతో ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైనర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రియుడిని జైల్లో పెట్టించి, తన ప్రేమకు అడ్డుపడుతున్నారని తండ్రి, సోదరుడిపై కక్ష పెంచుకుంది ఆ బాలిక. ప్రియుడు ముకుల్ జైలు నుంచి విడుదలైన అనంతరం అతనితో కలిసి ఇంటికి వెళ్లి తండ్రిని, సోదరుడిని చంపేసింది. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టింది. అనంతరం అక్కడి నుంచి ప్రియుడితో కలిసి పరార్ అయింది. ఘటన జరిగిన 2 నెలల తర్వాత బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.