Telugu Global
National

Tata Punch -Maruti | టాటా పంచ్‌ను కొట్టి పారేసిన మారుతి కారు.. అది వ్యాగ‌న్ఆర్‌.. బాలెనో.. బ్రెజా.. డిజైర్ కాదు..!

టాటా పంచ్ ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ) వ‌ర్ష‌న్ కారు ధ‌ర రూ.6.13 ల‌క్ష‌ల నుంచి రూ.10.20 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్) మ‌ధ్య ప‌లుకుతుంది. మ‌రోవైపు టాటా పంచ్‌.ఈవీ కారు ధ‌ర రూ.10.99 ల‌క్ష‌ల నుంచి రూ.15.49 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య అందుబాటులో ఉంది.

Tata Punch -Maruti | టాటా పంచ్‌ను కొట్టి పారేసిన మారుతి కారు.. అది వ్యాగ‌న్ఆర్‌.. బాలెనో.. బ్రెజా.. డిజైర్ కాదు..!
X

Tata Punch -Maruti | గ‌త రెండు నెల‌లుగా టాటా మోటార్స్‌.. టాటా పంచ్ దేశంలో అత్య‌ధికంగా విక్ర‌యిస్తున్న కారు. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో దేశంలో ఎక్కువ‌గా విక్ర‌యం అవుతున్న ఎస్‌యూవీ కార్ల‌లో టాటా పంచ్ మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌త నెల‌లోనూ దేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ నిలిచింది. చాలా మంది మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్‌, బాలెనో, డిజైర్, బ్రెజా మోడ‌ల్ కార్ల సేల్స్ టాటా పంచ్‌ను దాటేసిందనుకుంటారు. కానీ ఇటీవ‌ల భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన ఫోర్త్ జన‌రేష‌న్ స్విఫ్ట్ టాటా పంచ్‌ను క్రాస్ చేసింది.

దేశంలోని ప్రముఖ మోడ‌ల్ కార్ల‌ను దాటేసిన టాటా పంచ్‌.. గ‌త మార్చిలో 17,547 యూనిట్లు విక్ర‌యిస్తే, గ‌త ఏప్రిల్‌లో 19,158 యూనిట్ల‌కు పెరిగింది. గ‌త నెల‌లో 18,949 యూనిట్ల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. గ‌త మే నెల‌లో టాటా పంచ్ సేల్స్ స్వ‌ల్పంగా త‌గ్గితే, మారుతి సుజుకి స్విఫ్ట్ స్వ‌ల్పంగా పుంజుకున్న‌ది. మారుతి స్విఫ్ట్ గ‌త నెల‌లో19,393 యూనిట్లు అమ్ముడైంది. గ‌త నెల‌లోనే న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధ‌ర రూ.6.49 ల‌క్ష‌ల నుంచి రూ.9.64 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

టాటా పంచ్ ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ) వ‌ర్ష‌న్ కారు ధ‌ర రూ.6.13 ల‌క్ష‌ల నుంచి రూ.10.20 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్) మ‌ధ్య ప‌లుకుతుంది. మ‌రోవైపు టాటా పంచ్‌.ఈవీ కారు ధ‌ర రూ.10.99 ల‌క్ష‌ల నుంచి రూ.15.49 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య అందుబాటులో ఉంది.

టాటా పంచ్ కారుకు మారుతి సుజుకి స్విఫ్ట్ మాత్ర‌మే నిజ‌మైన పోటీదారు కాదు. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ క్ర‌మంగా పుంజుకుంటున్న‌ది. గ‌త నెల‌లో హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 5,328 యూనిట్లు విక్ర‌యిస్తే, హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ గ‌త నెల‌లో 7,697 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధ‌ర రూ.5.92 ల‌క్ష‌ల నుంచి రూ.8.56 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ రూ.6.13 ల‌క్ష‌ల నుంచి రూ.10.28 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కూ ప‌లుకుతుంది.

First Published:  9 Jun 2024 6:06 AM GMT
Next Story