Telugu Global
National

దక్షిణాదిపై మళ్ళీ హిందీ రుద్దే ప్రయత్నం... ఈ సారి పెరుగు ప్యాకెట్ల లొల్లి... స్టాలిన్ ఆగ్రహం

హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీ రుద్దే ప్రయత్నాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని FSSAIని స్టాలిన్ ట్వీట్‌లో కోరారు.

దక్షిణాదిపై మళ్ళీ హిందీ రుద్దే ప్రయత్నం... ఈ సారి పెరుగు ప్యాకెట్ల లొల్లి... స్టాలిన్ ఆగ్రహం
X

దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగు ప్యాకెట్లపై హిందీలో 'దహీ' అని తప్పకుండా లేబుల్ ఉండాలంటూ భారతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) ఇచ్చిన ఆదేశాలు వివాదం సృష్టించాయి.

హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీ రుద్దే ప్రయత్నాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని FSSAIని స్టాలిన్ ట్వీట్‌లో కోరారు.

“మాపై హిందీ రుద్దేందుకు మీకెందుకు అంత‌ పట్టుదల ? హిందీ మాట్లాడని మారాష్ట్రాల్లో మా మాతృ భాషను చిన్నచూపు చూసి, పెరుగు ప్యాకెట్‌పై కూడా హిందీలో లేబుల్ వేయమని మమ్మల్ని నిర్దేశించడం ఏంటి ? ” అని స్టాలిన్ అన్నారు.

"మా మాతృభాషల పట్ల ఇటువంటి విస్మయకరమైన మీ చర్యల వల్ల మిమ్మల్ని దక్షిణాది నుండి శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తుంది," అన్నారాయన.

FSSAI సూచనలను రాష్ట్రంలో అమలు చేయబోమని, పెరుగు ప్యాకెట్లపై 'తైర్' అనే తమిళ పదం లేబుల్ వేస్తామని తమిళనాడు డెయిరీ అభివృద్ధి మంత్రి ఎస్‌ఎం నాసర్ స్థానిక మీడియాతో అన్నారు.

మరో వైపు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పెరుగు సాచెట్లపై స్థానిక భాషలో పేర్లను ఉపయోగించాలని కేంద్రాన్ని కోరాయి.

First Published:  30 March 2023 8:39 AM IST
Next Story