Telugu Global
National

తమిళనాడులో కాషాయ కీచకుడు

గుంపులో ఉన్న శశికళ పుష్ప రాద్ధాంతం చేయలేకపోయింది, మౌనంగా ఆ హింసను భరించింది. మానవమృగం పక్కనే ఉన్నా సభ్య సమాజంలో ఉన్నామన్న భావనతో ఆమె సైలెంట్ గా ఉంది.

తమిళనాడులో కాషాయ కీచకుడు
X

గతంలో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఖర్మ కాలి రెండేళ్ల క్రితం డీఎంకేని వదిలి బీజేపీలో చేరారు. డీఎంకేలో హుందాగా రాజకీయం చేసిన ఆమె ఇప్పుడు బీజేపీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అంత జరిగినా ఆమె నోరు మెదపలేదు, కారణం పార్టీ పరువు పోకూడదని. కానీ వీడియో సాక్ష్యం బయటకు రావడంతో కాషాయదళం పరువు మంటగలిసింది. బీజేపీలో ఇంత కక్కుర్తిగాళ్లు ఉన్నారా అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. కాషాయ కీచకుడి విషయంలో బీజేపీ సమాధానమేంటని నిలదీస్తున్నారు.

అసలేం జరిగింది..?

రామ‌నాధ‌పురం జిల్లాలో ద‌ళిత నేత ఇమ్మానుయేల్ శేఖ‌ర‌న్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు శ‌శిక‌ళ పుష్ప హాజ‌రయ్యారు. ఆమెతోపాటు మరికొంతమంది బీజేపీ నేతలు కూడా వచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పొన్ బాల‌గ‌ణ‌ప‌తి అనే నీఛుడు కూడా ఆ గుంపులో ఉన్నాడు. కనీసం వర్థంతి సభ అనే ఇంగితం కూడా లేకుండా.. పుష్పగుచ్ఛం ఉంచే సమయంలో శ‌శిక‌ళ పుష్ప చీర‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాడు బాలగణపతి. ఆమె గట్టిగా అతని చేయి తోసివేసి తన చీరకొంగుని దగ్గరకు లాక్కొంది. అక్కడితో ఆ నీఛుడు ఆగలేదు. ఆమె చేతిని పదే పదే తాకే ప్రయత్నం చేశాడు. గుంపులో ఉన్న శశికళ పుష్ప రాద్ధాంతం చేయలేకపోయింది, మౌనంగా ఆ హింసను భరించింది. మానవమృగం పక్కనే ఉన్నా సభ్య సమాజంలో ఉన్నామన్న భావనతో ఆమె సైలెంట్ గా ఉంది.


ఈ లైంగిక వేధింపుల వీడియోని డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్య‌ద‌ర్శి ఇసై ద‌క్షిణామూర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీలో చేరిన మ‌హిళ‌లు ఆ పార్టీ నేత‌ల నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌స్తోందంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. డీఎంకే నేతలు ఈ వీడియోని షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. డీఎంకేలో ఉన్నప్పుడు శశికళ పుష్పను ఎంతో గౌరవంగా చూసుకున్నామని, ఆఖరికి ఆమెకు ఇలాంటి దుస్థితి ఎదురైందని సానుభూతి చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల ఔన్నత్యం, సాధికారత గురించి లెక్చర్లు దంచే బీజేపీలో ఇలాంటి నీఛులు కూడా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పింది.

First Published:  14 Sept 2022 4:53 PM IST
Next Story