Telugu Global
National

ది కశ్మీర్‌ ఫైల్స్‌కు అవార్డులా.. స్టాలిన్ షాకింగ్ కామెంట్స్‌..!

ఇక స్టాలిన్ కామెంట్స్‌పై స్పందించారు కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌. స్టాలిన్ వ్యాఖ్యలు దేశాన్ని ప్రశ్నించేలా ఉన్నాయన్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌కు రెండు అవార్డులు రావడం వెనుక ఎలాంటి లాబీయింగ్ లేదన్నారు.

ది కశ్మీర్‌ ఫైల్స్‌కు అవార్డులా.. స్టాలిన్ షాకింగ్ కామెంట్స్‌..!
X

69వ నేషనల్ ఫిలిం అవార్డుల ప్రకటనపై వివాదం రాజుకుంది. ప్రధానంగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు నేషనల్‌ ఇంటిగ్రిటీ అవార్డు ఇవ్వడంపై మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీలకతీతంగా విమర్శలు ఎదుర్కొన్న సినిమాకు నర్గీస్‌దత్‌ జాతీయ సమగ్రత అవార్డు ఇవ్వడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. చీప్‌ పాలిటిక్స్ కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని తగ్గించొద్దంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న శ్రేయా ఘోషల్‌, మ్యూజిషియన్‌ శ్రీకాంత్ దేవా, ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు అందుకున్న కడైసి వివసాయి, సిర్పిగాలిన్‌ సిర్పంగల్ బృందాలను స్టాలిన్ అభినందించారు. ఇక కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం కశ్మీర్‌ ఫైల్స్ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు రావడంపై ట్విట్టర్‌లో స్పందించారు. నేషనల్ ఇంట్రిగ్రిషన్ అని టైప్‌ చేసి ఓ లాఫింగ్‌ ఎమోజీ ట్వీట్ చేశారు.


ఇక స్టాలిన్ కామెంట్స్‌పై స్పందించారు కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌. స్టాలిన్ వ్యాఖ్యలు దేశాన్ని ప్రశ్నించేలా ఉన్నాయన్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌కు రెండు అవార్డులు రావడం వెనుక ఎలాంటి లాబీయింగ్ లేదన్నారు. ప్రజల మద్దతుతోనే అవార్డులు వచ్చాయని చెప్పారు. ఈ పురస్కారాలను కశ్మీర్‌ పండిట్లకు అంకితం చేస్తున్నామని చెప్పారు. దేశంలో ధర్మాన్ని రక్షించడమే తమ కర్తవ్యమన్నారు అభిషేక్‌ అగర్వాల్‌.

69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021లో విడుదలైన సినిమాలకు సంబంధించినవి. అయితే ఇందులో 2022 మార్చిలో విడుదలైన RRR, 2022 జూలైలో విడుదలైన రాకెట్రి, 2022 ఫిబ్రవరిలో విడుదలైన గంగూబాయ్‌ కఠియవాడి సినిమాలను కూడా అవార్డులు వరించాయి. దీంతో చాలా మంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు 6 అవార్డులు, గంగూబాయ్‌ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది.

*

First Published:  25 Aug 2023 11:10 AM GMT
Next Story